Ooru Peru Bhairavakona Review: టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఊరి పేరు భైరవకోన’. వీఐ ఆనంద్ డైరెక్షన్‌లో ఈ మూవీని సోషియో ఫాంటసీ థ్రిల్లర్ గా రూపొందించారు. వర్ష బొల్లమ్మ, కావ్య తాపర్ హీరోయిన్స్ గా నటించారు. ఈ మధ్యకాలంలో సరైన హిట్ లేకపోవడంతో.. ఈ సినిమాతో ఎలాగైన హిట్ కొట్టాలి అనే కసితో ఉన్నాడు సందీప్ కిషన్.
ఊరు పేరు భైరవకోన సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నారు దర్శక నిర్మాతలు. ఫిబ్రవరి 14నే ఈ మూవీ ప్రీమియర్ షోలు వేశారు. వాటి మంచి రెస్పాన్స్ వచ్చింది. అదే జోష్‌తో ఈ రోజు ఫిబ్రవరి 16న భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
కాంట్రాక్ట్ కిల్లర్ వద్ద పనిచేసే దొంగ బసవలింగం (సందీప్ కిషన్) ఇతని పాత్ర చుట్టూ ఈ కథ తిరుగుఉంటుంది.. నగరంలో తప్పిపోయిన అమ్మాయి భూమి (వర్ష బొల్లమ్మ). ఈ అమ్మాయిని కలుసుకోవడంతో బసవ జీవితం మలుపు తిరుగుతుంది. ఆమె ప్రేమలో పడిన బసవ ఆమె తన లక్ష్యమని తెలియక ఆమెకు సహాయం చేస్తాడు. కొన్ని పరిస్థితులు కారణంగా.. భూమికి భద్రత కల్పించడం బసవకు ప్రాదన్యంగా మారింది, ఈ పరిస్థితుల వారిని భైరవకోన అనే రహస్య గ్రామానికి వెళ్లేందు దారి తీస్తాయి.
ఇక్కడ, వారు అతీంద్రియ శక్తులను ఎదుర్కొంటారు. ఆమె కోసం, ఆమె గూడెం ప్రజల కోసం ఒక పెళ్లిలో అమ్మాయి నగలు దొంగతనం చేస్తాడు. భైరవకోన వెళ్లిన బసవకు ఎటువంటి పరిస్థితులు ఎదర్కుంటాడు? అసలు భైరవకోన చరిత్ర ఏమిటి? ఆ కోనకు, గరుడ పురాణంలో మాయమైన నాలుగు పేజీలకు సంబంధం ఏమిటి? భైరవకోన నుంచి బసవ అండ్ గ్యాంగ్ ప్రాణాలతో బయటపడ్డారా? లేదా? అనేది కథ.
దర్శకుడు వీఐ ఆనంద్‌కు ఇటువంటి సినిమాలు తీయడంలో మంచి పట్టు ఉంది. సూపర్ నాచురల్ అంశాలతో ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘ఒక్క క్షణం’ వంటి హారర్ సినిమాలు తీసి విజయాలు అందుకున్నాడు. ఈ క్రమంలో మొదటి నుంచే ‘ఊరు పేరు భైరవకోన’ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.
ప్రేక్షకులు ఆయన నుంచి ఆశించే నాచురల్, హారర్, థ్రిల్లర్, కామెడీ అన్నీ ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయి. ఇంటర్వెల్ వరకు వీఐ ఆనంద్ మ్యాజిక్ కొంత వరకు వర్కవుట్ అయ్యింది. ఆ తర్వాత కథలో బలం తగ్గింది. వీఐ ఆనంద్ మ్యాజిక్ మిస్ అయ్యింది. అడ్వెంచరస్ థ్రిల్లర్ సినిమా కాస్త రొటీన్ లవ్ స్టోరీ అయిపోయింది.
దర్శకుడు క్రియేట్ చేసిన భైరవకోన ప్రపంచం ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది. సినిమా ప్రారంభమే ఊరు చూపించి భైరవకోనపై ఆసక్తి కలిగించారు. తర్వాత హీరో హీరోయిన్ల పరిచయం సాదాసీదాగా ఉన్నప్పటికీ… పాటలు, కామెడీ సీన్లతో సినిమా పాసైపోయింది. భైరవకోనలో ఎంటరైన తర్వాత వెన్నెల కిశోర్, వైవా హర్ష కామెడీ నవ్విస్తుంది. మిగతా పాత్రల ప్రవర్తన క్యూరియాసిటీ కలిగిస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ బావుంటుంది. ఆ తర్వాత అసలు సిసలు కథలోకి వెళ్లిన తర్వాత ఆసక్తి నెమ్మదిగా సన్నగిల్లుతుంది.
‘ఊరు పేరు భైరవకోన’లో పాత్రలను పరిచయం చేసేటప్పుడు కలిగే ఆసక్తి కథలోకి వెళ్లిన తర్వాత ఉండదు. ఇక దెయ్యాలను బకరా చేయాలనుకునే సన్నివేశాలు శ్రీను వైట్ల సినిమాలను గుర్తు చేశాయి. క్లైమాక్స్ కూడా నర్మల్‌గా ముగుస్తుంది. ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో లేదు.
ఈ సినిమాలో సందీప్ కిషన్ తన పాత్ర న్యాయం చేశాడు. వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ తమ పాత్రల్లో మెప్పించారు. వైవా హర్ష మరియు వెన్నెల కిషోర్ కామెడీ బాగుంది. ఇతర నటీనటులు తమ పరిది మేరకు నటించారు. టెక్నికల్ టీమ్ నుంచి వీఐ ఆనంద్ మంచి అవుట్‌పుట్ రాబట్టుకున్నారు. శేఖర్ చంద్ర అందించిన సంగీతం చిత్రానికి ప్రాణం పోసింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. నేపథ్య సంగీతం కూడా బావుంది. సినిమాటోగ్రఫీ, విజువల్స్ ఎఫెక్ట్స్ బావున్నాయి