HomeTelugu Trendingరేలంగి దర్శకత్వంలో హర్రర్ కామెడీ మూవీ

రేలంగి దర్శకత్వంలో హర్రర్ కామెడీ మూవీ

Relangi movie Oo Antava
ప్రముఖ దర్శకుడు రేలంగి నరసింహారావు దర్శకత్వంలో ఓ కామెడీ హర్రర్ మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి “ఊ అంటావా మావా ఊఊ అంటావా” టైటిల్ ఖరారు చేశారు. యశ్వంత్, జబర్దస్త్ రాకింగ్‌ రాకేష్, అనన్య, హిందోలా చక్రవర్తి, పూజ, సిమ్రాన్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తుమ్మల ప్రసన్న కుమార్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు పాటలు మినహా షూటింగ్‌ పూర్తి చేసుకుంది. ఫిల్మ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడు కొల్లి రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి దామోదర్‌ ప్రసాద్‌ ఈ చిత్రం టైటిల్‌ను వెల్లడించారు.

దర్శకుడు రేలంగి నరసింహారావు మాట్లాడుతూ కామెడీతో కూడుకున్న హర్రర్‌ సినిమా ఇది. జులై చివరి వారంలో సినిమాను విడుదల చేస్తామని అన్నారు. 76 సూపర్‌ హిట్స్‌ అందించిన రేలంగి నరసింహారావు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కూడా సూపర్ హిట్‌ అవుతుందని నిర్మాత అన్నారు. ఈ చిత్రానికి సాబు వర్గీస్ సంగీతం అందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu