HomeTelugu Big Storiesపుష్ప: 'ఊ అంటావా ఊఊ అంటావా' మేల్‌ వెర్షన్‌.. వైరల్‌

పుష్ప: ‘ఊ అంటావా ఊఊ అంటావా’ మేల్‌ వెర్షన్‌.. వైరల్‌

oo anatava oo oo antava mal
ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా నటించిన ‘పుష్ప. ఈసినిమాలో స్టార్‌ హీరోయిన్‌ సమంత ఐటమ్‌ సాంగ్‌ చేసిన సంగతి తెలిసిందే. ‘ఊ అంటావా మావ ఊఊ అంటావా’ అంటూ సాగే ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్‌లో సుమారు 34 మిలియన్ల వ్యూస్‌తో టాప్‌ ట్రెండింగ్‌లో అంది. ఇప్పుడు ఇదే పాటకు మేల్‌ వెర్షన్‌ బయటకు వచ్చింది. ఒరిజినల్‌ వెర్షన్‌లో ఉన్న లిరిక్స్‌నే తీసుకొని.. ‘మీ కళ్లల్లోనే వంకర ఉంది. ఆడాళ్ల బుద్ధే వంకర బుద్ధి. ఊ అంటావా పాప ఊఊ అంటావా’ అంటూ మార్చి పాడి.. ‘వాలి’ అనే ఓ నెటిజన్‌ ట్విటర్‌ వేదికగా షేర్‌ చేశారు. ఆ పాటకు తగినట్టు ‘తమ్ముడు’, ‘అత్తారింటికి దారేది’, ‘బిల్లా’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’, ‘వేదం’, ‘ఖైదీ నం: 150’ చిత్రాల్లోని పలు ఫేమస్‌ స్టెప్పులతో ఈ క్లిప్‌ను తయారు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకర్షిస్తోంది. ‘మేల్‌ వెర్షన్‌ అదిరింది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సుకుమార్‌ డైరెక్షణ్‌లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత‍్రం రేపు (డిసెంబర్ 17) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో పుష్ప రాజ్‌గా స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ఊర మాస్‌ లుక్‌లో అలరించబోతున్నారు. రష్మిక హీరోయిన్‌గా నటిస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu