టాలీవుడ్‌లో కమెడియన్‌గా టాప్ రెంజ్‌లో ఉన్న సమయంలోనే హీరోగా టర్న్ తీసుకున్నాడు సునీల్. అందాల రాముడు, పూలరంగడు, మర్యాద రామన్న.. వంటి విజయాలు అందుకున్నా హీరోగా మాత్రం నిలదొక్కుకోలేకపోయాడు సునీల్. దీంతో మళ్లీ కమెడియన్‌గా టర్న్ తీసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇటీవల వచ్చిన ‘కలర్ ఫోటో’లో విలన్ అవతారం ఎత్తాడు. అది కూడా పెద్దగా సక్సెస్ కాలేకపోయాడు. ఈ తరుణంలోనే సునీల్ మళ్లీ హీరోగా నటించబోతున్నాడన్న వార్త ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతుంది.
కన్నడలో విజయం సాధించిన ‘బెల్‌బాటమ్’ సినిమా తెలుగులో రీమేక్ చేయనున్నారట. కామెడీతో పాటు స్పై తరహా కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో రిషబ్ శెట్టి, హరిప్రియ జంటగా నటించారు. ఈ రీమేక్ మూవీలో సునీల్‌ను హీరోగా నటింపజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.