HomeTelugu Trending'ఓ మై గాడ్‌-2' ట్రైలర్‌

‘ఓ మై గాడ్‌-2’ ట్రైలర్‌

OMG2 Trailer

బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్ హీరోగా తొమ్మిదేళ్ల క్రితం బాలీవుడ్‌లో విడుదలైన చిత్రం ‘ఓ మై గాడ్’ .ఈ మూవీ ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఉమేష్ శుక్ల దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో నెలకొల్పిన రికార్డుల అంతా ఇంతా కాదు. అప్పట్లోనే ఈ సినిమా రెండొందల కోట్లు కలెక్షన్‌లు సాధించింది. ఇదే సినిమాను తెలుగులో వెంకటేష్, పవన్ కళ్యాణ్ గోపాల గోపాలగా రీమేక్ చేశారు.

ఇక్కడ కూడా ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఇక ఇప్పుడు ఓమై గాడ్‌కు సీక్వెల్ తెరకెక్కుతుంది. ఓ మై గాడ్-2 పేరుతో అమిత్‌ రాయ్‌ డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కుతుంది, ఈ. ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లు, టీజర్‌ వీర లెవల్లో అంచనాలు క్రియేట్‌ చేస్తున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి మేక‌ర్స్ ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ట్రైల‌ర్ గ‌మ‌నిస్తే.. తొలిపార్టులో కృష్ణుడిగా కనిపించిన అక్షయ్‌ కుమార్‌.. ఓ మై గాడ్-2లో శివుడిగా కనిపించనున్నాడు. తొలిపార్టులో నాస్తికుడిగా పరేశ్‌ రావల్‌ కనిపిస్తే.. ఇందులో మీర్జాపూర్ ఫేమ్ పంకజ్‌ త్రిపాఠి గొప్ప భక్తుడిగా కనిపిస్తాడు.

మూడు నిమిషాలు ఉన్న ఈ ట్రైల‌ర్‌లో పంకజ్‌ త్రిపాఠి తన సమస్యలను పరిష్కరించమని దేవుడిని ప్రార్థిస్తున్న‌ట్లు క‌నిపిస్తుంది. ఇక పరేశ్‌ రావల్ మొద‌టి పార్టులో త‌న షాప్ కోసం కోర్టులో దేవుడిపై కేసు వేసిన‌ట్లే.. ఓ మై గాడ్-2లో పంకజ్ కేసు దేవుడిపై ఉంటుంది. కాగా ట్రైల‌ర్‌తోనే సినిమాపై వీర లెవల్లో అంచనాలు క్రియేట్‌ అయ్యాయి. ఈ సినిమా తొలి పార్టుకు మించి ఉండబోతున్నట్లు ట్రైలర్‌ ద్వారా తెలుస్తుంది. వాకావ్ ఫిలింస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాలో యామి గౌతమ్ లాయ‌ర్‌గా కీలక పాత్ర పోషిస్తుంది. ఇక ఆగస్టు 11న ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్‌ కాబోతుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu