Om Raut about Prabhas Adipurush Collections:
బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ Prabhas హీరోగా తెరకెక్కిన సినిమా ఆది పురుష్. నిజానికి ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ ను శ్రీరాముడి పాత్రలో చూడడానికి ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూడటం మొదలుపెట్టారు.
సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ కొంచెం అటు ఇటుగా అనిపించినప్పటికీ.. సినిమా మీద అంచనాలు మాత్రం అంతగా తగ్గలేదు. కానీ సినిమా విడుదలయ్యాక కనీసం ఫ్యాన్స్ కూడా సినిమా మీద పాజిటివ్ కామెంట్స్ చేయలేకపోయారు. రామాయణాన్ని ఎలా తీయకూడదో అలా తీశారు అని.. అసలు ఇది రామాయణమే కాదు అంటూ.. చాలామంది సినిమాని, చిత్ర డైరెక్టర్ ఓం రౌత్ ని భారీగా ట్రోల్ చేశారు.
ఇక వరుసగా సినిమాలు చేస్తున్న ప్రభాస్ మళ్ళీ సలార్ సినిమాతో కమర్షియల్ సక్సెస్ అందుతున్నారు. ఇక కల్కి సినిమాతో.. ప్రభాస్ మర్చిపోలేని బ్లాక్ బస్టర్ అందుకున్నారు. నెమ్మదిగా ఆది పురుష్ సినిమా ఎఫెక్ట్ మర్చిపోయి.. ప్రభాస్ కొత్త సినిమాలు సెలెబ్రేట్ చేసుకుంటున్నా సమయంలో.. డైరెక్టర్ ఓం రౌత్ మళ్లీ ఆది పురుష్ సినిమా కలెక్షన్ల గురించి షాకింగ్ కామెంట్స్ చేసి ఫ్యాన్స్ ని అసహనానికి గురి చేస్తున్నారు.
“హేటర్స్ వాళ్ళకి నచ్చినట్లు రోల్స్ చేస్తూ ఉంటారు. వాళ్ల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆఖరికి ఏది ముఖ్యం అంటే అది బాక్స్ ఆఫీస్ వద్ద వచ్చిన కలెక్షన్లు. అది పురుష సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద చాలా బాగా కలెక్షన్లు నమోదు చేసుకుంది. మొదటి రోజే దేశవ్యాప్తంగా సినిమా 70 కోట్లకు పైగా కలెక్షన్లు నమోదు చేసుకుంది. ఫైనల్ రన్ పూర్తయ్యేసరికి సినిమా 400 కోట్లకు పైగా కలెక్షన్లు తెచ్చుకుంది. అందులో 200 కు పైగా కోట్లు ఆంధ్ర తెలుగు తెలంగాణ నుంచి వచ్చాయి”అని అన్నారు ఓమ్ రౌత్.
ఫ్లాప్ సినిమా గురించి మరొకసారి ఫాన్స్ కి గుర్తు చేస్తూ మనోభావాలను దెబ్బతీస్తున్నారు అంటూ.. ఓం రౌత్ మీద మళ్ళీ ట్రోల్స్ మొదలయ్యాయి. సినిమా కలెక్షన్లు 400 కోట్లు అయినప్పటికీ.. సినిమాకి పెడుతున్న బడ్జెట్ 700 కోట్లు అని.. కలెక్షన్స్ తో సంబర పడటం కాదు డిస్ట్రిబ్యూటర్లకు కరిగిన భారీ నష్టాల గురించి కూడా మాట్లాడాలి కదా అని కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరేమో 400 కోట్లు కలెక్షన్లు వచ్చాయి అన్న అందులో ప్రతి రూపాయి ప్రభాస్ కారణంగానే వచ్చింది అని.. అందులో ఓం రౌత్ చేసింది ఏమీ లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.