HomeTelugu Trendingబాలయ్య షూటింగ్‌ వద్ద.. బామ్మ సందడి.. వీడియో వైరల్‌

బాలయ్య షూటింగ్‌ వద్ద.. బామ్మ సందడి.. వీడియో వైరల్‌

Old Women dance At Balayya

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో ఓసినిమా చేస్తున్నాడు. 107వ సినిమాగా అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈసినిమాని నిర్మిస్తుంది. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. ఈ సినిమా కోసం కర్నూలులో అడుగుపెట్టారు బాలయ్య గోపీచంద్‌ మలినేని. అక్కడి కొండా రెడ్డి బురుజు సమీపంలో బాలయ్య శృతిహాసన్ పాల్గొనగా ఓ సన్నివేశాన్ని దర్శకుడు గోపీచంద్ చిత్రీకరిస్తున్నారు.

ఇదిలా వుంటే కొండారెడ్డి బురుజు సమీపంలో బాలయ్య సినిమా షూటింగ్ జరుగుతున్న విషయాన్ని తెలుసుకున్న సామాన్యులు తండోపతండాలుగా అక్కడికి చేరుకున్నారు. జై బాలయ్య జై బాలయ్య అంటూ నినాదాలు చేశారు. అయితే ఓ బామ్మ మాత్రం షూటింగ్ స్పాట్ వద్ద విజిల్స్ వేస్తూ షుషారుగా డాన్స్ చేస్తూ హోరెత్తించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ గా మారింది.

బాలయ్య ఫ్యాన్స్ ఈ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్ చేస్తూ మరింత వైరల్ చేస్తున్నారు. ఈ మూవీలో కన్నడ హీరో దునియా విజయ్ విలన్ గా నటిస్తుండగా వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించబోతోంది. హనీ రోజ్ లాల్ చంద్రికా రవి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu