సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’. తాజాగా ఈ సినిమా నుండి రెండో పాట విడులైంది. ‘ఓ మై బేబీ’ అనే ఈ పూర్తి లిరికల్ సాంగ్ నేడు (డిసెంబర్ 13) వచ్చేసింది. హీరో మహేశ్, హీరోయిన్ శ్రీలీల మధ్య డ్యుయెట్‍గా ఈ సాంగ్ ఉంది.
నా కాఫీ కప్పులో షుగర్ క్యూబ్.. నువ్వే నువ్వే.. నా కంటి రెప్పలో కాటుక ముగ్గు.. నువ్వే నువ్వే’ అంటూ క్యాచీ లైన్లతో ఈ సాంగ్ మొదలైంది. ఈ పాటకు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందించాడు. ప్రముఖ పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. ఈ పాటను శిల్పా రావు పాడారు.
ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం తుది దశకు చేరుకుంది. చాలా ఏళ్ల తర్వాత మహేశ్ – త్రివిక్రమ్ కాంబోలో రిపీట్ అవుతుండటంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన అప్డట్స్‌కు మంచి స్పందన వచ్చింది.
ఈ సినిమా వచ్చే నెల (2024) జనవరి 12న సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. హారిక, హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మించారు.