ఆంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఆంధ్ర ప్రజల్లో భారీగా మార్పు తెచ్చినట్టు కనిపిస్తోంది. జగన్ రెడ్డి పార్టీ కార్యకర్తకి కూడా మొన్నటివరకూ సామాన్య నీరు పేదలు భయపడేవారు. ఎక్కడ వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడితే, తమ పథకాలు కట్ అవుతాయో అని ప్రతి క్షణం వైసీపీ వారితో జాగ్రత్తగా ఉండేవారు. కానీ, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు తర్వాత.. వైసీపీ నాయకులు, కార్యకర్తలు భయపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే.. తమ పరిస్థితి ఏమిటి ? అనేది వారి ఆందోళనగా తెలుస్తోంది.
దీని నుంచి అయినా, వైసీపీ కార్యకర్తలు చాలా నేర్చుకోవాలి. ఎక్కడో చాటుగా పరిపాలించే ఒక వ్యక్తిని నమ్ముకుని తమ చుట్టూ ఉన్న వారితో గొడవలు పడితే.. జీవితాలు నాశనం అయ్యేవి తమవే అని వైసీపీ చోటా నాయకులు, కార్యకర్తలు ఇకనైనా కళ్లు తెరవాలి. లేకపోతే చివరకు బలి అయిపోయేది మీరే. ఇది చెప్పే రాజకీయ పాఠం ఏమీ కాదు. కానీ అందరూ తెలుసుకోవాల్సిన గుణపాఠం. ఐతే, కొందరు మాత్రం ఇంకా జగన్ రెడ్డి మత్తులోనే ఉండటం ఆశ్చర్యంగా ఉంది.
వారంతా చెప్పేది ఏమనగా.. సాధారణ ఎన్నికల్లో ఎట్టిపరిస్థితుల్లో వైసీపీ పార్టీనే గెలుస్తోంది అని, కాబట్టి ఎప్పటిలాగే మనం మన పైత్యాన్ని చూపించుకోవచ్చు అన్నట్టు వారి ధోరణి ఉంది. అజ్ఞానానికి ఎన్నో దారులు ఉంటాయి. అలాంటి దారుల్లోనే తమ బతుకులను లాక్కొస్తున్న వారి జీవితాలను మనమెలా బాగు చేయగలం ?, కానీ వారికీ వారే మారేలా పరిస్థితులే మారాలి. అయినా, వారంతా చెబుతున్నట్లు సాధారణ ఎన్నికల్లో జగన్ రెడ్డి హవా నడవకపోవచ్చు.
ఉదాహరణకు..ఎమ్మెల్సీ ఎన్నికలనే తీసుకుందాం. బిజెపి, జనసేన పేరుకి భాగస్వాములు కానీ, ఆచరణలో కాదని తేలిపోయింది. జనసేన అభిమానుల్లో డిగ్రీ చదివిన యువత చాలామంది ఉన్నారు. ముఖ్యంగా వైజాగ్ ప్రాంతంలో పవన్ కళ్యాణ్ ఫాలోవర్స్ గణనీయంగా ఉన్నారు. వారంతా పవన్ కళ్యాణ్ మాటలను బట్టి తమ ఓట్లను బీజేపీ అభ్యర్థికి వేయాలి. కానీ వేశారా ?. ఒకవేళ వేసి ఉంటే.. మరెందుకు బీజేపీ అభ్యర్థికి డిపాజిట్టు కూడా దక్కలేదు. మరి దక్కలేదంటే దానికి అర్థం ఏమిటి ?. వైజాగ్ లో ఓట్లు అన్నీ టీడీపీకే పడ్డాయి అంటే..దానికి అర్థం ఏమిటి ?.
ప్రజలు ఈ సారి చంద్రబాబు నాయుడుని ఎలాగైనా గెలిపించుకోవాలని బలంగా నిర్ణయించుకున్నారు. అందుకే, వైసీపీని ఓడించండి అని పిలుపునిచ్చిన పవన్ కళ్యాణ్ మాటలతో సంబంధం లేకుండా టీడీపీకి ఓట్లు వేశారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో కూడా ప్రజల తీర్పు ఇలాగే ఉంటుంది. కాబట్టి.. వైసీపీ నాయకులు, కార్యకర్తలు అతి చేయకుండా పద్ధతిగా ఉంటే వారికే మంచిది.