HomeTelugu Big Storiesరణ్‌వీర్‌తో 'అపరిచితుడు' రీమేక్‌ ప్రకటించిన శంకర్‌

రణ్‌వీర్‌తో ‘అపరిచితుడు’ రీమేక్‌ ప్రకటించిన శంకర్‌

Shankar Aparichitudu Remake
సౌత్‌ స్టార్‌ డైరెక్టర్ శంకర్ ‘అపరిచితుడు’ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి రెడీ అయ్యారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వెల్లడించారు. బాలీవుడ్ సూపర్ స్టార్ రణ్‌వీర్ సింగ్ ఈ రీమేక్ లో హీరోగా నటించనున్నారు. పెన్ మూవీస్ బ్యానర్ పై జయంతిలాల్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా నిర్మించనున్నారు. తమిళంలో ‘అన్నియన్’గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో ‘అపరిచితుడు’ పేరుతో విడుదలైంది. 2005లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సాధించిన విజయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ ఉన్న వ్యక్తిగా మూడు పాత్రల్లో అద్భుతంగా నటించిన చియాన్ విక్రమ్ నటనకు దక్షిణాది ప్రేక్షకులు ఫిదా అయ్యారు. 2022 ద్వితీయార్థంలో ఈ పాన్ ఇండియా మూవీ సెట్స్ పైకి వెళ్లనుందని మేకర్స్ తెలిపారు. మరి ఈ సినిమా రీమేక్ లో రణ్వీర్ నటన ఎలా ఉంటుందో చూడాలి. ఇటీవల కాలంలో సౌత్ సినిమాలు వరుసగా బాలీవుడ్ లో రీమేక్ అవుతున్నాయి. తెలుగులో హిట్ అయిన ‘టెంపర్’ రీమేక్ ‘సింబా’తో బడా హిట్ అందుకున్నాడు రణ్‌ వీర్.

Recent Articles English

Gallery

Recent Articles Telugu