టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత స్పెషల్ సాంగ్ లో మెరవనుంది. ‘పుష్ప’ సినిమా కోసం అమ్మడు ఒక అడుగు ముందుకేసింది. ఎప్పటినుంచో అనుకున్నట్టుగానే పుష్ప రాజ్ తో సామ్ చిందులేయనుంది. ఇక ఈ విషయాన్ని పుష్ప మేకర్స్ అధికారికంగా రివీల్ చేశారు. బన్నీ–సుకుమార్– డీఎస్‌పీ కాంబినేషన్ లో వస్తున్న ‘పుష్ప’ చిత్రంలో ప్రత్యేక గీతంలో నటించానికి సమంత అంగీకరించినట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఈ నెల చివర్లో ఈ సాంగ్ షూట్ ఉండనుంది. కాగా ఇప్పటికే కాజల్, శృతి హాసన్, తమన్నా స్పెషల్ సాంగ్స్‌తో అలరించిన సంగతి తెలిసిందే.
A big Thank You to the supremely talented @Samanthaprabhu2 garu for accepting our request and doing this sizzling number in #PushpaTheRise 💥#PushpaTheRiseOnDec17@alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil @Dhananjayaka @Mee_Sunil @anusuyakhasba @ThisIsDSP @adityamusic pic.twitter.com/fD0QRDVYTg
— Mythri Movie Makers (@MythriOfficial) November 15, 2021