జానీ సినిమా తర్వాత రేణూ దేశాయ్ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత మళ్లీ సినిమాలో నటిస్తున్నారు. తాజాగా రేణు దేశాయ్ నటిస్తున్న రవితేజ సినిమా టైగర్ నాగేశ్వరరావు. గజదొంగ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.
టైగర్ నాగేశ్వరరావు సినిమా ప్రమోషన్లో భాగంగా రేణూ దేశాయ్ అనేక విషయాలు వెల్లడించారు. తనకు మహేశ్‌బాబు సినిమా సర్కార్ వారి పాటలో అవకాశం వచ్చిందని తెలిపారు.
కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమాలో నటించలేకపోయానని అన్నారు. కాంట్రావర్సీని దృష్టిలో పెట్టుకొని కారణాలను చెప్పలేకపోతున్నట్లు తెలిపారు.
సర్కార్ వారి పాట సినిమాలో బ్యాంక్ ఆఫీసర్ పాత్ర కోసం తనను సంప్రదించారని, ఆ రోల్ కూడా తనకు ఎంతగానో నచ్చిందన్నారు. కొన్ని కారణాల వల్ల నటించలేక పోయానని, నిజం చెప్పాలని ఉంది కానీ కాంట్రవర్సీ క్రియేట్ అవుతుందని అందుకే కామ్‌గా ఉండటం బెటర్ అని అన్నారు.