HomeTelugu Trendingబింబిసార: ఓ తేనె ప‌లుకుల సాంగ్‌ విడుదల

బింబిసార: ఓ తేనె ప‌లుకుల సాంగ్‌ విడుదల

O Tene Palukula from Bimbis
నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ నటిస్తున్న తాజా చిత్రం ‘బింబిసార’. మగధ రాజ్యాన్ని పాలించిన హర్యాంక వంశస్థుడు బింబిసారుని బయోపిక్‌గా సోషియో ఫాంట‌సీ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈసినిమాకి వ‌శిష్ఠ్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా మేక‌ర్స్ ముందుగా ప్ర‌క‌టించిన షెడ్యూల్ ప్ర‌కారం రెండో పాట‌ ఓ తేనె ప‌లుకుల ఫుల్ ఆడియో సాంగ్‌ను విడుద‌ల చేశారు.

క‌ల్యాణ్ రామ్‌, కేథ‌రిన్ కాంబోలో వ‌చ్చే ఈ పాట ఫోక్‌ జోన‌ర్‌లో క‌ల‌ర్‌ఫుల్‌గా సాగుతూ మ్యూజిక్ ల‌వ‌ర్స్ ను ఆక‌ట్టుకుంటోంది. వ‌రికుప్ప‌ల యాద‌గిరి ఈ పాట‌ను రాయ‌డమే కాకుండా సంగీతం అందించారు. హైమ‌త్‌, స‌త్య యామిని పాడారు. ఎంఎం కీర‌వాణి కంపోజ్ చేసిన ఈ జాన‌ప‌ద మెలోడీ ట్రాక్ క‌ల్యాణ్ రామ్ సిగ్నేచ‌ర్ స్టెప్‌తో వింటేజ్ వైబ్స్ ను అందిస్తోంది. య‌శ్ మాస్ట‌ర్ ఈ పాట‌కు కొరియోగ్ర‌ఫీ చేశాడు.

ఫుల్ వీడియో సాంగ్‌ను జులై 23న విడుదల చేయ‌నున్నారు. వెన్నెల కిశోర్‌, వ‌రీనా హుస్సేన్‌, శ్రీనివాస రెడ్డి, బ్ర‌హ్మాజీ ఇత‌ర కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆగ‌స్టు 5న థియేట‌ర్ల‌లో గ్రాండ్‌గా విడుద‌ల కానుంది. హోంబ్యాన‌ర్ నందమూరి తారకరామారావు ఆర్ట్స్ బ్యానర్ పై కే హ‌రికృష్ణ భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎంఎం కీర‌వాణి సంగీతం అందిస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu