నందమూరి బాలకృష్ణ స్వయంగా నటిస్తూ.. నిర్మిస్తున్న చిత్రం ‘ఎన్టీఆర్’ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ బయోపిక్కు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా రెండు భాగాలుగా జనవరిలో రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ రాజకీయ ప్రసంగాలను ప్రత్యేకంగా చూపించనున్నారట. ఎంతో ఆవేశంగా సాగే ఎన్టీఆర్ ప్రసంగాలు అప్పట్లో సంచలనం సృష్టించాయి.
అందుకే సినిమాలో ఆ సన్నివేశాలకు మరింత స్కోప్ ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాదు ఆ సన్నివేశాల్లో బాలయ్య ఎన్టీఆర్ పాత్రలో కనిపించినా.. డబ్బింగ్ మాత్రం చెప్పటం లేదట.అప్పట్లో ఎన్టీఆర్ చేసిన ప్రసంగాల వాయిస్కే బాలయ్య యాక్ట్ చేస్తారట. అంటే బాలయ్య తెర మీద కనిపించినా గొంతు మాత్రం సీనియర్ ఎన్టీఆర్దే. ప్రస్తుతం ఈ ప్రచారం టాలీవుడ్ లో గట్టిగానే జరుగుతోంది. మరి ఈ వార్తలపై చిత్రయూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.