NTR donation for Vijayawada floods:
తెలుగు రాష్ట్రాలను గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, మంగళగిరి ప్రాంతాలు, తెలంగాణలో సూర్యాపేట, ఖమ్మం, నల్గొండ జిల్లాలు భారీ వర్షాలతో అతలాకుతలమయ్యాయి. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు వరద సహాయ చర్యలకు విరాళాలు ప్రకటిస్తున్నారు.
ఈ ఉదయం ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధులకు రూ. 50 లక్షల విరాళం ప్రకటించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ ఎన్టీఆర్, “రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల వచ్చిన వరదలు నాకు ఎంతో బాధ కలిగించాయి. ఈ విపత్తు నుంచి తెలుగు ప్రజలు త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.” అంటూ పేర్కొన్నారు.
తన వంతుగా, “ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు తీసుకుంటున్న సహాయ చర్యలకు సహకారం అందించేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధులకు రూ. 50 లక్షలు విరాళం ప్రకటిస్తున్నాను,” అని ఎన్టీఆర్ అన్నారు.
కెరీర్ పరంగా, జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర పార్ట్ 1 విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది.