HomeTelugu TrendingNTR31: స్టార్ డైరెక్టర్ తో ఎన్టీఆర్ సినిమా రిలీజ్ ఎప్పుడో తెలుసా!

NTR31: స్టార్ డైరెక్టర్ తో ఎన్టీఆర్ సినిమా రిలీజ్ ఎప్పుడో తెలుసా!

Official launch of NTR31 directed by Prashanth Neel
Official launch of NTR31 directed by Prashanth Neel

NTR31 Release Date:

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో బిజీగా ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 27న విడుదల కాబోతోంది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కే జీ ఎఫ్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కెరియర్ లో 31వ సినిమాగా విడుదల అవుతున్న ఈ సినిమా అప్డేట్.. ఇప్పుడు వైరల్ గా మారింది.

ఇవాళ ఆగస్టు 9న ఈ సినిమా అనుకున్నట్టుగానే అధికారికంగా లాంచ్ అయ్యింది. హైదరాబాద్ లోనే దీనికి సంబంధించిన పూజా కార్యక్రమం కూడా జరిగింది. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సినిమాకి సంబంధించిన టెక్నికల్ టీమ్ తో పాటు మరికొందరు పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కే జీ ఎఫ్, సలార్ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో హీరో పాత్రకి ప్రశాంత్ ఇచ్చిన ఎలివేషన్స్ మామూలుగా ఉండవు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ కి ఏ రేంజ్ ఎలివేషన్ ఇస్తారు అని.. ఇప్పటినుంచే ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా కామెంట్లు చేస్తున్నారు.

ఈ సినిమాకి డ్రాగన్ అనే ఆసక్తికరమైన టైటిల్ అనుకుంటున్నట్లు టాక్ నడుస్తోంది. సినిమాని లాంచ్ చేస్తూ టైటిల్ కూడా ప్రకటిస్తే బాగుంటుంది అని ఫ్యాన్స్ ఆశించారు కానీ.. దానికోసం ఇంకా కొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే. అయితే ఈ సినిమా విడుదల తేదీ మాత్రం చిత్ర బృందం ప్రకటించేసింది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా 2026 సంక్రాంతి సందర్భంగా జనవరి 9న విడుదల కాబోతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన కనిపించనున్న హీరోయిన్ గురించి కూడా పుకార్లు వినిపిస్తున్నాయి కానీ ఇంకా క్లారిటీ లేదు.

ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ వంటి క్రేజీ కాంబినేషన్ లో సినిమా కాబట్టి సినిమా మీద చాలా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉంటుంది, కథ ఎలా ఉండబోతుంది అని మరిన్ని వివరాల కోసం ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu