జూనియర్ ఎన్టీఆర్- కొరటాల కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘ఎన్టీఆర్ 30’. ఈ సినిమా ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందని అని ఫ్యాన్స్ వేచి చుస్తున్నారు. చిత్రబృందం కూడా ఈ సినిమా షూటింగ్ ను ఫిబ్రవరి 24వ తేదీన లాంఛనంగా ప్రారంభిస్తామని ప్రకటించింది. హైదరాబాద్ లోని ఓ ప్రముఖ స్టూడియోలో పూజా కార్యక్రమాలతో సినిమాను ప్రారంభం చేయాలని నిర్ణయించింది.
కానీ ఇప్పుడు ఈ పూజా కార్యక్రమాలను వాయిదా వేశారు. జూనియర్ ఎన్టీఆర్ అన్నయ్య తారకరత్న మృతి చెందడంతో ఈ సినిమా ప్రారంభోత్సవానికి బ్రేక్ పడింది. జూనియర్ ఎన్టీఆర్ కు తారకరత్నకు ఆరోగ్యం బాగాలేదని తెలిసినప్పటి నుంచి చాలా కుంగిపోతున్నారు.
బెంగళూరులోని ఆస్పత్రిలో ఉండగా కూడా.. చాలా సార్లు ఆయన అక్కడకు వెళ్లి తారక రత్నను చూసి వచ్చారు. కానీ ఆయన చనిపోయారన్న వార్త తెలిసి తీవ్ర విషాధానికి గురయ్యారు. కంటతడి కూడా పెట్టుకున్నారు.
అయితే సోదరుడి అంత్యక్రియలు పూర్తి అయి.. ఆయన ఈ బాధ నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాతే తన తరువాతి సినిమాను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఎన్టీఆర్ 30 సినిమాను మళ్లీ ఏరోజు ప్రారంభిస్తారో చిత్రబృందం అధికారికంగా ప్రకటిస్తుంది.