యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తరువాత సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘అయినను పోయిరావలే హస్తినకు’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇప్పటికే ఈ సినిమా టైటిల్‌తో పోస్టర్లను కూడా రెడీ చేసి రిలీజ్ చేశారు ఎన్టీఆర్ అభిమానులు. ఈ సినిమా పూర్తి పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కబోతుందట. ఈ చిత్రంలో కీలక పాత్రకు గాను మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ను దర్శకుడు త్రివిక్రమ్ సంప్రదించాడట. ఒక రాజకీయ నాయకుడి పాత్ర కోసం మోహన్ లాల్ అయితే బాగుంటుందనే త్రివిక్రమ్ అభిప్రాయమట. విలువలతో కూడిన రాజకీయం చేసే ఒక మంచి పాత్ర కోసం మోహన్ లాల్‌ను త్రివిక్రమ్ ఎంపిక చేసుకున్నాడట. గతంలో జనతా గ్యారేజ్ చిత్రంలో దర్శకుడు కొరటాల శివ వీరిద్దరి కాంబోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. ఎన్టీఆర్ మోహన్ లాల్ కాంబినేషన్‌కి హిట్ కాంబోగా పేరుంది. కనుక త్రివిక్రమ్ ఎక్కువ ఆలోచించకుండా మోహన్ లాల్ ను ఈ సినిమా కోసం ఎంపిక చేశాడనే వార్తలు వస్తున్నాయి.