HomeTelugu Big Storiesఎన్టీఆర్ ఏంటీ.. కన్ఫ్యూజన్!

ఎన్టీఆర్ ఏంటీ.. కన్ఫ్యూజన్!

టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ ఇలా ఒక్కో సినిమాకు తన మార్కెట్ పరిధిని పెంచుకుంటూ ఎదుగుతున్నాడు ఎన్టీఆర్. వక్కంతమ్ వంశీ తో తన తదుపరి సినిమా ఉంటుందని అందరూ భావించారు. కానీ కథ నచ్చకో.. మరే ఇతర కారణాల వలనో తెలియదు కానీ మొత్తానికి ఈ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టేశారని తెలుస్తోంది. జనతా గ్యారేజ్ సినిమా తరువాత చేయబోయే సినిమా దానికి రెండింతలు గొప్పగా ఉండాలని భావిస్తూ.. ప్లాన్ చేసుకుంటున్నాడు ఎన్టీఆర్. దీనికోసం తెలుగు, తమిళ మార్కెట్స్ ను టార్గెట్ చేస్తూ.. లింగుస్వామితో సినిమా చేయాలని అనుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అలానే పూరీ జగన్నాథ్ తో కలిసి ఓ స్టయిలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ ను రూపొందించి దక్షిణాది భాషల్లో రిలీజ్ చేయాలని మరో ప్లాన్ చేస్తున్నాడు. ఒకవేళ పూరీ జగన్నాథ్ గనుక సినిమా చేస్తే.. హై బడ్జెట్ తో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ కు మంచి గుర్తింపు వచ్చే విధంగా చేస్తారని సమాచారం. మరోపక్క లింగుస్వామితో సినిమా చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. ఎన్టీఆర్ విషయంలో ఈ కన్ఫ్యూజన్ ఎప్పుడు వీడుతుందో..!
 
 

Recent Articles English

Gallery

Recent Articles Telugu