యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల్లో ఆయనొకరు. దాదాపు మూడు నెలలుగా ఆయన షూటింగ్ లో పాల్గొనకపోవడంతో తను ఎప్పుడు సినిమా తీస్తాడా..? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. రీసెంట్ గా బాబీ డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నా.. అంటూ అనౌన్స్ చేసి అభిమానులను సంతోషపరిచారు. ఎన్టీఆర్ కు అభిమాన సంఘాలు తక్కువేమీ లేవు. నిన్న ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యులు కళ్యాణ్ రామ్, లక్ష్మీ ప్రణతిలతో కలిసి రాజమండ్రీలో తన ఫ్యామిలీ ఫంక్షన్ కు హాజరయ్యారు.
ఎన్టీఆర్ వస్తున్నాడని తెలుసుకున్న అభిమానులు తను వస్తోన్న కార్ ను చుట్టుముట్టారు. మాసివ్ క్రౌడ్ తో కూడిన అభిమానులు ఎన్టీఆర్ కు ఘన స్వాగతం పలికారు. జై ఎన్టీఆర్ అంటూ తమ అభిమాన నటుడ్ని కొనియాడారు. అభిమానుల క్రౌడ్ ఎక్కువగా ఉండడంతో ఎన్టీఆర్ ఫంక్షన్ నుండి వెంటనే వెళ్ళిపోయారు. ఎన్టీఆర్ ఎయిర్ పోర్ట్ కు వెళ్ళేవరకు అభిమానులను కంట్రోల్ చేయడానికి పోలీసులు అష్టకష్టాలు పడ్డారు. వచ్చే సంవత్సరం మొదటి నెలలో ఎన్టీఆర్, బాబీల సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.