NTR Watch: పాన్ ఇండియా హీరో ఎన్టీఆర్ తాజాగా.. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన టిల్లు స్క్వేర్ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ కు హాజరయ్యారు. ఈ వేడుకల్లో ఎన్టీఆర్ మాట్లాడుతూ అభిమానులంతా గర్వంగా కాలర్ ఎగరవేసుకునేలా దేవర సినిమా ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం ఆయన స్పీచ్ బాగా వైరలైంది. దీంతో పాటుఫ్యాన్స్ని బాగా ఆకట్టుకుంది.
ఎన్టీఆర్ చేతికి పెట్టుకున్న వాచ్ చాలా గ్రాండ్ గా కనిపించింది. ఈ వాచ్ కు సంబంధించిన ఫొటోను తారక్
అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు. మరి ఆ వాచ్ ధరెంత? ఏ బ్రాండ్ ఏంటి అని సర్చింగ్ కూడా మొదలు పెట్టారు. ఎన్టీఆర్ ధరించిన ఈ వాచ్ ‘ఒడొమార్ పిగే రాయల్ ఓక్’ (Audemars Piguet Royal Oak). దీని ధర 189,000 డాలర్లు.
అంటే భారత కరెన్సీ ప్రకారం 1,57,32,455 (కోటి 57 లక్షలు) రూపాయలు ఉంటుందని అంచనా. ఇందులో చాలా మోడల్స్ కూడా ఉన్నాయి. దాన్ని బట్టి ధరలో కాస్త మార్పులు కూడా ఉన్నాయి. చూడటానికి చాలా సింపుల్‌గా ఉన్నప్పటికీ ఈ వాచ్ ధర మాత్రం భారీగా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కాగా ఈ వాచ్‌ని మాత్రం తన భార్య లక్ష్మీప్రణతి గిఫ్ట్ గా ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వాచ్ ట్రెండ్ అవుతుంది.
ఇక మీమ్స్ పెజీల్లో అయితే ఎన్టీఆర్ వాచ్ గురించి గట్టిగానే పోస్టులు పేలుతున్నాయి. ఈ వాచ్ అమ్మితే లైఫ్ మొత్తం సెట్టు అంటూ సోషల్ మీడియాలో ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ గతంలో కూడా చాలానే కాస్ట్లీ వాచ్‌లతో దర్శనమిచ్చారు. స్పోర్ట్స్ వాచ్, కస్టమైజ్డ్ వాచ్ ఇలా చాలానే కలెక్షన్లు ఎన్టీఆర్ దగ్గరున్నాయి. ఒకసారి అయితే ఎన్టీఆర్ ధరించిన వాచ్ ధర తెలిసి ఫ్యాన్స్ అవాక్కయ్యారు.
ప్రస్తుతం ఎన్టీఆర్ ‘దేవర’ షూటీంగ్లో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ రెండు పార్టులుగా రాబోతోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.