యంగ్ టైగర్ ఎన్టీఆర్ 21 రోజుల హనుమాన్ దీక్షను పూర్తి చేసుకున్నాడు. ఇక ఇప్పుడు కొరటాల శివ డైరెక్షన్‌లో రూపొందే తన 30వ ప్రాజెక్టుపై దృష్టి పెట్టనున్నాడు. తన కొత్త సినిమాలో పాత్రకు తగ్గ ఆకృతి కోసం జూనియర్ ఎన్టీఆర్ శారీరక కసరత్తులు ప్రారంభించనున్నాడు.
రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమరం భీమ్ పాత్రలో కనిపించిన ఎన్టీఆర్.. సినిమా ప్రచారంలో భాగంగా కాస్తంత ఒళ్లు చేశాడు. తన 30వ ప్రాజెక్టు కోసం ఇప్పుడు బరువు తగ్గించుకునే కసరత్తులు చేయనున్నట్టు సన్నిహిత వర్గాల కథనం. ప్రముఖ ఫిట్‌నెస్ నిపుణుడి ఆధ్వర్యంలో ఆయన తర్ఫీదు పొందనున్నాడు.
ఎన్టీఆర్ 30వ సినిమాను పాన్ ఇండియా ప్రాజెక్టుగా కొరటాల శివ తెరకెక్కించనున్నారు. జూన్‌లో సినిమా షూటింగ్ మొదలు కానుంది. మాస్ యాక్షన్, ఎంటర్ టైన్ మెంట్ భరితంగా ఈ సినిమా ఉంటుందని కొరటాల శివ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఈ సినిమాలో కథానాయిక ఎవరన్నది ఇంకా తేలలేదు. రష్మికను తీసుకోవచ్చన్న ప్రచారం నడుస్తోంది.