HomeTelugu Big StoriesNTR: జూనియర్ ని కాదు అంటూ ఫ్యాన్స్ ఎమోషన్స్ హర్ట్ చేస్తున్న తారక్?

NTR: జూనియర్ ని కాదు అంటూ ఫ్యాన్స్ ఎమోషన్స్ హర్ట్ చేస్తున్న తారక్?

NTR to change his name for Bollywood?
NTR to change his name for Bollywood?

NTR name change:

లెజెండరీ నటుడు సీనియర్ ఎన్టీఆర్ మనవడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్ మొదటినుంచి అభిమానులకి జూనియర్ NTR గానే తెలుసు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గా తనకి అంటూ ఒక ప్రత్యేకమైన హోదా ఉంది. అయినా కూడా అభిమానులు ఆయనను జూనియర్ ఎన్టీఆర్ అని పిలవడానికి ఇష్టపడతారు.

కానీ తాజాగా ఇప్పుడు ఎన్టీఆర్ తన పేరుని మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఎన్టీఆర్ టీం నుంచి వచ్చిన ఒక అధికారిక ప్రకటనలో ఎన్టీఆర్ పేరుని జూనియర్ ఎన్టీఆర్ అని కాకుండా మిస్టర్ ఎన్టీఆర్ అని ప్రచురించారు. దీనిపై అభిమానులు కూడా విభిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ వయసు 40 దాటింది. ఇప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ అని ట్యాగ్ అవసరం లేదు అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు ఇప్పుడిప్పుడే ఎన్టీఆర్ పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ అందుకుంటున్నారు. అక్కడ కూడా జూనియర్ ఎన్టీఆర్ అన్న పేరు ఉంటే కరెక్ట్ గా ఉండదు. అందుకని కూడా పేరు మార్చుకునే ఆలోచన చేస్తున్నారని మరికొందరు చెబుతున్నారు.

త్వరలో వార్ 2 సినిమాతో బాలీవుడ్ లో కూడా అడుగుపెడుతున్నారు ఎన్టీఆర్. తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడం కోసం ఇలా చేస్తున్నారు అని కొందరు అంటున్నారు. అయితే చాలా వరకు అభిమానులు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ అనేది ఒక బ్రాండ్ పేరు లాంటిది అని.. అది ఒక ఎమోషన్ అని అంటున్నారు.

ఇప్పుడు ఆ పేరు మార్చితే చాలామంది అభిమానుల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉంది. మరి ఎన్టీఆర్ తన పేరు మార్చుకుంటారో లేదో ఇంకా తెలియదు. ప్రస్తుతానికి సోషల్ మీడియా హ్యాండిల్స్ లో కూడా ఆయన పేరు జూనియర్ ఎన్టీఆర్ అని ఉంది. కాబట్టి సోషల్ మీడియాలో తన పేరు మారేదాకా అభిమానులు కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పవచ్చు.

ఇక సినిమాల పరంగా చూస్తే ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కూడా ఒక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు..

Recent Articles English

Gallery

Recent Articles Telugu