HomeTelugu Big StoriesDevara ఓకే కానీ RRR కంటే కాదుగా అంటున్న ఫ్యాన్స్

Devara ఓకే కానీ RRR కంటే కాదుగా అంటున్న ఫ్యాన్స్

NTR statement about Devara hurts RRR fans
NTR statement about Devara hurts RRR fans

NTR comments about Devara:

యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైనమిక్ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కనున్న భారీ యాక్షన్ డ్రామా దేవర: పార్ట్ 1 సెప్టెంబర్ 27న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ప్రపంచ స్థాయి సాంకేతిక నిపుణులు ఈ ప్రాజెక్ట్‌ కోసం పనిచేశారు. ప్రముఖ బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ఈ సినిమాతో తెలుగు పరిశ్రమలో అడుగు పెట్టనున్నారు.

ప్రస్తుతం చిత్ర బృందం సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ఎన్టీఆర్ కూడా సినిమాను భారీ స్థాయిలో ప్రమోట్ చేస్తున్నారు. నార్త్, సౌత్ లో మిగతా రాష్ట్రాలు కూడా పర్యటించి సినిమా గురించి మంచి బజ్ తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా చెన్నైలో ఎన్టీఆర్ తమిళ మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భంలో, దేవర తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమా అని అన్నారు. RRR వంటి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న చిత్రంలో నటించిన ఎన్టీఆర్ ఇలా చెప్పడం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచింది.

దేవర కూడా భారీ బడ్జెట్ సినిమానే అయ్యి ఉండచ్చు. కానీ అసలు ఎన్టీఆర్ కి గ్లోబల్ రేంజ్ లో సక్సెస్ ఇచ్చిన సినిమా RRR. కచ్చితంగా అదే ఎన్టీఆర్ కెరియర్ లో అత్యంత ప్రతష్టాత్మకమైన సినిమా. ఆ సినిమా కాకుండా దేవర గురించి ఎన్టీఆర్ ఇలా అనడం RRR ఫ్యాన్స్ మనోభావాలు దెబ్బతీశాయి అని చెప్పుకోవచ్చు.

 Read More: Devara చుట్టూ సందేహాలు, ఆటంకాలు మాత్రమేనా?

దేవర సినిమా అంచనాలను అందుకునేలా ఉంటుందా అంటే.. మరో పది రోజుల్లో తెలుస్తుంది. మిక్కిలినేని సుధాకర్, కోసరాజు హరికృష్ణ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అనిరుద్ రవిచందర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి ఇప్పటికే భారీ క్రేజ్ ఏర్పడింది. త్వరలోనే ఈ సినిమా నుంచి నాలుగవ పాటను విడుదల చేయబోతున్నారు.

ప్రస్తుతం “దేవర” ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి, అభిమానులు సినిమాను చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 22న హైదరాబాద్ నోవోటెల్ లో జరగనున్నట్లు సమాచారం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu