
యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేశంలో లంబోర్ఘిని ఉరుస్ కారును కొన్న తొలి వ్యక్తి. తాను కొన్న ఈ ఖరీదైన కారుతో ఎన్టీఆర్ తీసుకున్న ఫొటో వైరల్ అవుతోంది. సినీనటుడు శ్రీకాంత్, టీడీపీ నేత సునీల్ కుమార్ చలమలశెట్టి కూడా ఈ ఫొటోలో ఉన్నారు. వారి వెనకాలే కారు ఉంది. ఇది కారు డెలివరీ అయిన సందర్భంగా తీసుకున్న ఫోటో అయ్యుండొచ్చు అంటున్నారు. ఇటీవలే ‘ఆర్ఆర్ఆర్’ ప్రత్యేక పాట షూటింగ్ కోసం తారక్ ఉక్రెయిన్ వెళ్లివచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే ఆయన ఈ కారును బుక్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఇటలీకి చెందిన వోక్స్ వాగన్ కంపెనీ అనుబంధ సంస్థ లంబోర్ఘినీ తయారు చేసిన ఈ కారు ఇటీవలే అక్కడి నుంచి జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి డెలివరీ అయింది. ఇండియాలో లంబోర్ఘిని ఉరుస్ కారు కొన్న ఫస్ట్ హీరోగా ఎన్టీఆర్ నిలిచారనే వార్త సైతం ఇంటర్ నెట్ లో వైరల్ అయ్యింది. ఈ కారు ధర రూ.5 కోట్ల పైనే ఉంటుంది. ఇది 3.6 సెకన్లలో గంటలకు 100 కిలోమీటర్ల వేగాన్ని, 12.8 సెకన్లలో గంటకు 200 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. మొత్తానికి ఇది గంటకు 305 కిలోమీటర్ల వేగంతోనూ ప్రయాణించగలదు. ప్రపంచంలోనే అత్యధిక వేగంతో వెళ్లగలిగే కారు ఇదే.













