NTR Devara vs Prabhas Kalki on OTT:
NTR నటించిన ‘దేవర’ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రభాస్ ‘కల్కి 2898 AD’ కంటే ఎక్కువ వ్యూస్ సాధించింది. ‘దేవర’ మొత్తం 8.6 మిలియన్ల వ్యూస్‌ను నమోదు చేయగా, ‘కల్కి’ 8 మిలియన్ల వ్యూస్‌కు పరిమితమైంది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ ప్రపంచవ్యాప్తంగా నాలుగు వారాల పాటు టాప్ 10లో నిలిచింది.
మొదటి వారం ‘దేవర’కు 2.2 మిలియన్ల వ్యూస్ రాగా, రెండో వారం 1.9 మిలియన్లు, మూడో వారం 1.7 మిలియన్లు, చివరగా నాల్గో వారం 2.8 మిలియన్ల వ్యూస్‌ను సాధించింది. ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద సాధారణ స్పందన లభించినా, నెట్‌ఫ్లిక్స్‌లో మంచి వ్యూయర్‌షిప్‌ను పొందడం విశేషం.
‘దేవర’ కథలోని లోపాలు, నటనలో కూడా తప్పులు ఉన్నాయని ప్రేక్షకుల నుండి కొన్ని విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ, జూనియర్ ఎన్టీఆర్ భారీ మాస్ అపీల్ కారణంగా హిందీ ప్రేక్షకులను ఆకర్షించగలిగింది. జూనియర్ ఎన్టీఆర్ సూపర్‌స్టార్ ఇమేజ్ ఈ సినిమాకు నెట్‌ఫ్లిక్స్‌లో మంచి రన్ ఇచ్చింది.
‘దేవర’ కథ మరింత బలంగా ఉండి ఉంటే, ఈ సినిమా ఇంకా భారీ విజయం సాధించేదేమో అనేది అందరి అభిప్రాయం. అయినప్పటికీ, జూనియర్ ఎన్టీఆర్ తన స్టార్ పవర్‌తో మాత్రమే సినిమా టికెట్స్ అమ్ముడయ్యేలా చేయగలరు అని నిరూపించారు.