దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ సినిమా ఆర్ఆర్ఆర్ షూటింగ్ వేగంగా జరుగుతున్నది. ఇప్పటికే 70 శాతం పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఎన్టీఆర్… రామ్ చరణ్ హీరోలుగా చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇందులో రామ్ చరణ్ కు జోడీగా అలియాభట్ నటిస్తుండగా, ఎన్టీఆర్ కు జోడిగా విదేశీ హీరోయిన్ ఒలీవియా నటిస్తోంది. రామ్ చరణ్… అలియాపై ఇప్పటికే ఓ రొమాంటిక్ సాంగ్ ను షూట్ చేశారని సమాచారం. రామ్ చరణ్.. అలియాల మధ్యే కాకుండా, ఎన్టీఆర్ – ఒలీవియా మధ్య కూడా అదిరిపోయే రొమాంటిక్ సీన్స్ ఉన్నాయట. ఈ సీన్స్ ను రాజమౌళి రీసెంట్ గా షూట్ చేశారని తెలుస్తోంది. సినిమాలో యాక్షన్ తో పాటుగా రొమాన్స్ కూడా సూపర్ గా ఉంటుందని తెలుస్తోంది. వరసగా ఇలాంటి న్యూస్ బయటకు వస్తుండటంతో సినిమాపై రోజు రోజుకు అంచనాలు తారాస్థాయిలో పెరిగిపోతున్నాయి.