HomeTelugu Big Storiesఎన్టీఆర్ కొత్త టైటిల్ 'జై లవ కుస'!

ఎన్టీఆర్ కొత్త టైటిల్ ‘జై లవ కుస’!

‘జనతా గ్యారేజ్’ సినిమా తరువాత ఎన్టీఆర్, బాబీతో సినిమా చేస్తున్నట్లుగా అనౌన్స్ చేశాడు. ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిప్రాతాభినయం చేయనున్నాడు. డిఫరెంట్ గెటప్స్, ముగ్గురు స్టార్ హీరోయిన్స్, భారీ బడ్జెట్ సినిమా కావడంతో ఆటోమేటిక్ గా
సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. అయితే ఈ సినిమాకు టైటిల్ గా ‘నట విశ్వరూపం’ అనే పేరు ప్రచారంలోకి వచ్చింది.

కానీ నిర్మాత కల్యాణ్ రామ్ ఈ విషయాన్ని కొట్టి పారేశాడు. టైటిల్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదని వెల్లడించాడు. తాజాగా కల్యాణ్ రామ్ ఫిల్మ్ ఛాంబర్ లో ‘జై లవ కుస’ అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించాడు. టైటిల్ లో మూడు పేర్లు ఉండడంతో ఈ సినిమా కోసమే టైటిల్ ను రిజిస్టర్ చేయించినట్లుగా వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. మరి కల్యాణ్ రామ్ ఈ సినిమా కోసమే టైటిల్ ను రిజిస్టర్ చేయించాడా..? లేక మరో సినిమా ఏదైనా ప్లాన్ చేస్తున్నాడా..? అనే విషయం తెలియాల్సివుంది!

Recent Articles English

Gallery

Recent Articles Telugu