HomeTelugu TrendingNeel: ఎన్టీఆర్ ను 15 దేశాలు తిప్పనున్న డైరెక్టర్

Neel: ఎన్టీఆర్ ను 15 దేశాలు తిప్పనున్న డైరెక్టర్

Crazy Update about NTR - Neel movie shooting
Crazy Update about NTR – Neel movie shooting

NTR – Neel Movie Update:

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకి రాబోతున్న.. దేవర పార్ట్ వన్ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా అప్డేట్ల కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సినిమాకి సంబంధించిన రెండవ పాట లిరికల్ వీడియోని ఈనెల 5వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.

మరోవైపు ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమాల గురించి కూడా సోషల్ మీడియాలో భారీ చర్చ నడుస్తోంది. ఈ మధ్యనే ఎన్టీఆర్ హాయ్ నాన్న డైరెక్టర్ శౌర్యువ్ దర్శకత్వంలో.. రెండు భాగాలుగా విడుదల అయ్యే ఒక యాక్షన్ సినిమా చేస్తున్నారు అని వార్తలు వినిపించాయి. కానీ అందులో నిజం లేదు అని డైరెక్టర్ క్లారిటీ ఇచ్చేశారు.

మరోవైపు ఎన్టీఆర్ ప్రశాంత్ నీళ్ళు దర్శకత్వంలో చేయాల్సిన సినిమా ఇంకా పెండింగ్ లోనే ఉంది. తాజాగా సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త.. అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. ఈ సినిమా షూటింగ్ వచ్చే నెల అంటే సెప్టెంబర్ నుంచి.. పట్టాలెక్కే అవకాశం ఉంది. ఈ సినిమా షూటింగ్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15 దేశాల్లో జరగబోతోందట.

ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సినిమా షూటింగ్ మొదటి షెడ్యూల్లో ఎన్టీఆర్ పాలుపంచుకోవడం లేదు. ఎన్టీఆర్ కాకుండా మిగతా పాత్రలతో ఉండే సీన్స్ షూటింగ్ ఈ షెడ్యూల్లో జరుగుతుంది. ఎందుకంటే ఎన్టీఆర్ మరొకవైపు బాలీవుడ్ లో హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న వార్ 2 సినిమా షూటింగ్ తో బిజీగా ఉంటారు. ఈలోపు ప్రశాంత్ నీల్ మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

ఏడాది ఆఖరిలో సినిమా రెండవ షెడ్యూల్ నుంచి ఎన్టీఆర్ కూడా షూటింగ్లో పాల్గొంటారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్గా కనిపించనుంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబి డియోల్ ఈ సినిమాలో మెయిన్ విలన్ గా కనిపించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి.. డ్రాగన్ అనే టైటిల్ ను అనుకుంటున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu