టాలీవుడ్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఆర్ ఆర్ ఆర్’. ఈ మూవీ షూటింగ్ దాదాపుగా చివరి దశకి చేరుకుంది. ఈ సినిమా తరువాత త్రివిక్రమ్ తో కలిసి ఎన్టీఆర్ సెట్స్ పైకి వెళ్లనున్నాడు. అందుకు సంబంధించిన పనులతో త్రివిక్రమ్ బిజీగా వున్నాడు. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆ తరువాత సినిమాను ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేయనున్నాడు. ఇది భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా వుండనుందనేది తాజా సమాచారం. డిఫరెంట్ లుక్ తో .. చాలా పవర్ఫుల్ పాత్రలో ఎన్టీఆర్ ను ప్రశాంత్ నీల్ చూపించనున్నట్టు తెలుస్తోంది. 2021 చివర్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలెడతారట. 2023లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని అంటున్నారు. ప్రశాంత్ నీల్ పై .. ఆయన తయారు చేసిన కథపై నమ్మకంతో ఎన్టీఆర్ రెండు సంవత్సరాలు పాటు డేట్స్ ఇవ్వనున్నట్టు సమాచారం. భారీ బడ్జెట్ తో .. భారీ తారాగణంతో ఈ సినిమా నిర్మితమవుతుందని అంటున్నారు.