HomeTelugu Big Storiesఎన్టీఆర్ మహానాయకుడు ప్రీమియర్ షో చూసి ఎవరేమన్నారు?

ఎన్టీఆర్ మహానాయకుడు ప్రీమియర్ షో చూసి ఎవరేమన్నారు?

12 10
ఎన్టీఆర్ బయోపిక్ లోని మొదటి భాగం కథానాయకుడు తర్వాత రెండో భాగం ‘మహానాయకుడు’ రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈరోజు సాయంత్రం 7 గంటలకు సినీ ప్రముఖులు, కుటుంబ సభ్యుల కోసం ఏఎంబి సినిమాస్ లో ప్రీమియర్ షో వేశారు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఈ సినిమా క్లైమాక్స్ చాలా భావోద్వేగంతో కూడుకొని ఉందని, ప్రతి ఒక్కరి హృదయాలను కదిలిస్తుందని తెలుస్తోంది. సినిమా రిలీజ్ కు ముందు నిర్వహించే ప్రీ రిలీజ్ వేడుకలు, భారీ ప్రమోషన్లు వంటివి చేయకుండా సినిమాను సైలెంట్ గా రిలీజ్ చేస్తున్నారు. ఎమోషనల్ గా సినిమా బాగుందని టాక్ వినిపిస్తోంది. ఈ ఎమోషన్ ఎంతవరకు వర్కౌట్ అయింది. సినిమా ఎలా ఉంటుందనే విషయాలు పూర్తిగా తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.

ప్రీమియర్ షో చూసిన అనంతరం పలువురు ప్రముఖులు చిత్రంపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ కథా నాయకుడు చూశాక గొంతు ఉవ్వెత్తున పైకి లేచింది కానీ, మహానాయకుడు సినిమా చూశాక గొంతు బయటకు రావడం లేదు. అద్భుతమైన ఎన్టీఆర్ జీవన ప్రయాణాన్ని అద్భుతంగా చూపించారని, ముఖ్యంగా అసెంబ్లీలో కూర్చున్నప్పుడు జరిగిన ఆదృశ్యం గుర్తుకొచ్చి ఆయన మౌనంగా కూర్చున్నారు గానీ, మేమంతా పళ్లు నూరుకున్నామో ఆరోజున మాకు తెలుసు. సంకల్పబలం ఉంటే మనిషి ఏదైనా సాధించగలడు, ఎంతవాడినైనా ఎదిరించగలడనేదానికి ఎన్టీఆర్ జీవితం నిదర్శనం, ఆ జీవితాన్ని బాలయ్య అద్భుతంగా చూపించారని తెలిపారు. ఒక్క మాటలో చెప్పాలంటే హార్ట్‌ టచింగ్ మూవీ అని తెలిపారు. పరుచూరి మాట్లాడుతూ ఇప్పటి వరకు రెండు భాగాలు చూపించారు. మరో అంకం ఉంది అన్న
ట్టుగా వివరించారు. క్లైమాక్స్‌లో తారకమ్మ అంకం చూసే సరికి మా గొంతు ఎండిపోయిందని, మాట రాని పరిస్థితి అని అన్నారు.

సిరివెన్నెల సీతారామశాస్త్రి మాట్లాడుతూ కాలాన్ని దాదాపు 30, 40 ఏళ్లు వెనక్కి తిప్పి, కరిగించి, జరిగిన దాని గురించి వినడం గానీ, చదవడం గానీ, తెలుసుకోవడం గానీ జరుగుతుంది గానీ చూడటం జరగదు ఆ విచిత్రాన్ని ఇవాళ చూశామని అన్నారు. మన కళ్లముందు నిలబెట్టిన విధంగా చిత్రీకరణ అద్భుతంగా ఉందని కొనియాడారు. బాలయ్య నటనపై ప్రశంసలు కురిపించారు. ఎన్టీఆర్‌లా నూటికి వెయ్యిపాళ్లు మన ముందు కనిపించి ఆయన వెళ్లలేదు అనే నమ్మకాన్ని మనలో కలిగించారని అన్నారు. మహా అద్భుతం ఆవిష్కరించారు, కళ్లు చెమర్చకుండా ఉండవు అని తెలిపారు. తెలుగు ప్రజలు తాము మరిచిపోయిన తమ ఘనతను మరోసారి గుర్తుచేసుకుంటారని అన్నారు.

కథానాయకుడు కంటే కూడా మహానాయకుడు నాకా చాలా బాగా నచ్చింది అంటూ దర్శకుడు పూరీ జగన్నాథ్ తెలిపారు. బసవతారకం గురించి చెప్పే డైలాగ్‌తో తాను ఏడ్చేశానని, అసెంబ్లీలో ఎన్టీఆర్‌కు జరిగిన అవమానానికి వెక్కి వెక్కి ఏడ్చాను అని పూరీ చెప్పారు. తాను ఇంతగా ఎప్పుడూ ఏడవలేదని ఈ సినిమా నన్ను అంతగా కదిలించింది అని తెలిపారు. మహానాయకుడు సినిమా ఎంత గొప్పదో బాలయ్య నటన కూడా అంత గొప్పది. బాలయ్య కెరీర్‌లో ది బెస్ట్ ఫిలిం అన్నారు పూరీ జగన్నాథ్.

ప్రముఖ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ ఎన్టీ రామారావు గారి నట విశ్వ రూపం చాలా సినిమాల్లో చూశాం. ఎన్టీఆర్‌కు జరిగిన అవమానాలు చాలాసార్లు టీవీల్లో, పేపర్లోనూ చూశాం. చాలా కాలం గడిచిపోయింది. కానీ ఇవాళ సినిమాలో చూస్తుంటే పార్ట్‌-1 చూసినప్పుడు నిజంగా నేను నిరాశకు గురయ్యానని అన్నారు. సెకండ్ పార్ట్ చూశాక చాలా అద్భుతంగా అనిపించింది అన్నారు. మళ్లీ ఆ రామారావుగారిని చూసిన ఫీలింగ్ వచ్చిందని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. బాలయ్య నటన అద్భుతమని కొనియాడారు. సినిమా చాలా బాగుందని అన్నారు. క్రిష్ అద్భుత దర్శకత్వ ప్రతిభ చూపించాడని అన్నారు. ఎప్పుడో బడిపంతులు సినిమాలో చూశాను అలాంటి నటన.. తండ్రిని మించిన తనయుడు అనిపించేలా బాలయ్య నటించాడని ప్రశంసించారు.

మరో దర్శకుడు వీవీ వినాయక్ మాట్లాడుతూ సాధారణంగా బాలయ్య మాస్ డైలాగ్‌ చెప్పినప్పుడు థియేటర్లో అంతా ఈలలు వేస్తారు. కానీ ఈ సినిమాలో నాతో సహా అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. బసవతారకం గారికి క్యాన్సర్ అని తెలిసినప్పుడు వచ్చే సన్నివేశంలో రేపు ప్రేక్షకులంతా కన్నీళ్లు పెట్టుకుంటారని, తన తండ్రి ఎన్టీఆర్ ఆయనలో నిక్షిప్తమై ఉన్నారా అన్నట్టుగా బాలయ్య నటించాడని వీవీ వినాయక్ అన్నారు. సినిమా చాలా ఎమోషనల్‌గా ఉంటుందని అన్నారు. ఎన్టీఆర్ ఇంట్లో ప్రేక్షకులు కూర్చున్నట్టు ఫీల్ కలుగుతుందన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu