Devara Ticket Scam in USA:
తాజా సమాచారం దేవర సినిమా ప్రీమియర్ షో టికెట్ అమ్మకాలపై ఒక ఆసక్తికరమైన విషయం అమెరికా వర్గాల నుండి బయటకు పొక్కింది. సాధారణంగా, సినిమా టికెట్ ధరలో 40% ఎగ్జిబిటర్స్‌కు వెళ్తుంది.. మిగతా 60% డిస్ట్రిబ్యూటర్లు మరియు నిర్మాతలకు చెందుతుంది.
ఉదాహరణకు, నిర్మాతలు అన్ని కేంద్రాల్లో అన్ని టికెట్లను కొనుగోలు చేస్తే, వారు 60% మొత్తాన్ని వెనక్కి తీసుకుంటారు. అయితే, 40% నష్టం ఉన్నా కూడా థియేటర్లు నిండిపోయినట్టు చూపించడం ద్వారా.. హీరోకు భారీ డిమాండ్ ఉందని సినిమాపై హైప్ క్రియేట్ చేయవచ్చు. ఇది హీరో కెరీర్‌కి ఉపయోగపడడమే కాక పెద్ద మార్కెటింగ్ స్ట్రాటజీ.
ఇలాంటి సమయంలో ఈ టికెట్ల కొనుగోలు పథకంలో హీరో కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉండే అవకాశం ఉంది. ఇక ఈమధ్యనే విడుదల అయిన దేవర సినిమా విషయంలో మొదట కేవలం గాసిప్‌గా వినిపించినా, ఇప్పుడు ఈ వాదనలో నిజం ఉంది అని తెలుస్తోంది.
టెక్సాస్‌లోని ఒక థియేటర్‌లో టికెట్లు అందుబాటులోకి వచ్చిన ఒక రోజులోనే, దాదాపు 80% సీట్లు (సుమారు 120-130) అమ్ముడయ్యాయని ఆన్‌లైన్‌లో చూపిస్తున్నారు. కానీ, ఈ షోలో కేవలం 24 మంది ప్రేక్షకులు మాత్రమే హాజరయ్యారు. సినిమా విడుదలకు నాలుగు వారాల ముందే టికెట్లు పూర్తిగా అమ్ముడవడాన్ని బట్టి, ఇది స్కామ్ అని అంటున్నారు.
కొందరు దాన్ని కుంభకోణం అంటుండగా.. మరికొంత మంది దీన్ని ఒక తెలివైన మార్కెటింగ్ వ్యూహం అని కొట్టి పారేస్తున్నారు. ఈ టికెట్ స్కామ్ వల్ల హీరో స్టార్‌డమ్, డిమాండ్ పెరుగుతాయి.
ఈ విధానం నార్మల్‌గా మారితే, ప్రతి పెద్ద తెలుగు సినిమా టికెట్లు పూర్తిగా అమ్ముడయ్యాయని చెప్పుకోవచ్చు.
ఇదే టాక్ హిందీ, తమిళ లో కూడా వ్యాప్తి చెందితే, అమెరికాలోని మిగతా థియేటర్లు కూడా వేరే భారతీయ సినిమా ప్రీమియర్స్‌ను ఎక్కువగా ప్రదర్శించేందుకు ఆసక్తి చూపవచ్చు. మరి దేవర విషయంలో కూడా ఈ టికెట్ కుంభకోణం జరిగితే.. ఎన్టీఆర్ కి కూడా ఇందులో హస్తం ఉంటుందా అని టాక్ నడుస్తోంది.
Read More: Devara సినిమా నుండి దావుడి పాట తీసేసింది ఎవరో తెలుసా?