HomeTelugu Trendingనందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో ఎంట్రీ

నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో ఎంట్రీ

Ntr grandson chaitanya kris
నందమూరి తారకరామారావు ఫ్యామిలీ నుంచి మరో నట వారసుడు ఎంట్రీ ఇస్తున్నాడు. ఎన్టీఆర్ పెద్ద కుమారుడు జయకృష్ణ ఇటీవల ‘బసవతారకరామ క్రియేషన్స్’ పేరుతో ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించినం సంగతి తెలిసిందే. ఇప్పుడీ సంస్థ.. జయకృష్ణ కుమారుడు చైతన్య కృష్ణ హీరోగా ఓ సినిమాను రూపొందిస్తోంది. ఈ బ్యానర్ నుంచి ప్రొడక్షన్ నంబర్ 1గా వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా నిన్న బాలకృష్ణ విడుదల చేశారు.

ఈ సందర్భంగా జయకృష్ణ మాట్లాడుతూ… బసవతారకరామ క్రియేషన్స్ నుంచి తన కుమారుడిని హీరోగా పరిచయం చేస్తుండడం ఆనందంగా ఉందన్నారు. సరికొత్త కథతో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ‘రక్ష’, ‘జక్కన్న’ ఫేం డైరెక్టర్‌ వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాకు సంబంధించి త్వరలో మరిన్ని వివరాలను వెల్లడించనున్నట్టు జయకృష్ణ తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu