NTR Watch cost:
యంగ్ టైగర్ ఎన్టీఆర్ సెల్ఫ్ మేడ్ స్టార్ అని చెప్పుకోవచ్చు. పేరుకి నందమూరి కుటుంబం నుండి వచ్చినా కూడా.. ఇండస్ట్రీ కి వచ్చిన కొత్తల్లో చాలా కష్టాలు పడ్డారు. వరుస ఫ్లాప్స్ కూడా అందుకుని చాలా డిస్టర్బ్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ అన్నిటినీ దాటుకుంటూ ఎన్టీఆర్ నటుడిగా ఇప్పుడు చాలామంచి పేరు సంపాదించారు. తన నందమూరి కుటుంబ పేరు ఇంకా పైకి తీసుకువెళ్తూ కెరియర్ లో ముందుకు దూసుకు వెళ్తున్నారు
ఎన్టీఆర్ కి ఇప్పుడు చాలా పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన షర్ట్ నుండి చెప్పుల దాకా అన్నిటి గురించి ఫ్యాన్స్ వెతుకుతూ ఉంటారు. తాజాగా ఎన్టీఆర్ ధరించిన వాచీ ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది. నిన్న జరిగిన ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ సినిమా లాంచ్ ఈవెంట్ నుండి వచ్చిన ఫోటోలు వైరల్ అయ్యాయి. ముఖ్యంగా అందులో ఎన్టీఆర్ లుక్ కి ఫ్యాన్స్ చాలా ఎక్సైట్ అవుతున్నారు. అయితే ఈవెంట్ లో ఎన్టీఆర్
వాచ్ పెట్టుకున్న వాచీ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ వాచీ ధర ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఈ వాచీ ధర సుమారు 2.5 కోట్లు. రెండున్నర కోట్ల వాచీ అంటే మామూలు విషయం కాదు.
ఆ వాచీ చాలా పెద్ద బ్రాండ్ అయిన Patek Philippe అనే కంపెనీకి చెందినది. దీని గురించి గూగుల్ లో సెర్చ్ చేస్తే పెద్ద హిస్టరీ కూడా వస్తుంది. అమెరికాలో దీని రేటు సుమారుగా మూడు లక్షల డాలర్లు. ఇక ఇండియాకు వచ్చేసరికి అదనపు పన్నులు అన్నీ కలిపి 2.5 కోట్లు.
ఇక సినిమాల పరంగా ఎన్టీఆర్ త్వరలో దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.