HomeTelugu Big Storiesఎన్టీఆర్, చైతులను కలిపిన సావిత్రి!

ఎన్టీఆర్, చైతులను కలిపిన సావిత్రి!

‘గుండమ్మ కథ’ చిత్రాన్ని రీమేక్ చేసి అందులో హీరోలుగా ఎన్టీఆర్, నాగచైతన్యలను పెట్టాలని అనుకున్నారు. అయితే ఆ ప్రాజెక్ట్ మాత్రం ఎందుకో సెట్ కావడం లేదు. కానీ ఈ ఇద్దరు హీరోలు ఒకే సినిమాలో కనిపిస్తున్నారనేది తాజా సమాచారం. అసలు విషయంలోకి వస్తే.. అలనాటి మహానటి సావిత్రి జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అశ్వనీదత్ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని నాగశ్విన్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్ గా నిత్యమీనన్ ను ఫైనల్ చేశారు. సావిత్రి జీవితం అంటే అందులో ఎన్.టి.రామారావు, నాగేశ్వరావుల ప్రస్తావన రాక మానదు. ఎందుకంటే ఆమె ఎక్కువగా ఆ హీరోలతోనే కలిసి పని చేసింది. సినిమాలో వారి పాత్రలు కూడా ఉన్నాయి. దీనికోసం ఎవరిని తీసుకోవాలని ఆలోచిస్తున్న తరుణంలో అశ్వనీదత్ కు ఎన్టీఆర్ పాత్రకు జూనియర్ ఎన్టీఆర్ ను, నాగేశ్వరావు పాత్రకు నాగచైతన్యలను తీసుకోవాలని భావించాడట. ఈ విషయమై ఇప్పటికే ఆ ఇద్దరి హీరోలతో సంప్రదింపులు జరిపారని తెలుస్తోంది. హీరోలు కూడా సానుకూలంగా స్పందించారని సమాచారం. ఎన్టీఆర్, చైతు ఒకే సినిమాలో కనిపిస్తున్నారంటే ఫ్యాన్స్ కు పండగే మరి!

Recent Articles English

Gallery

Recent Articles Telugu