ఎన్టీఆర్ వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి.. తన నటనతో, డైలాగ్ డెలివరీతో, డాన్స్‌తో టాలీవుడ్‌లో స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు జూనియర్ ఎన్టీఆర్. పేరులోనే కాదు.. అభినయంలోనూ ఆయన తాత వారసత్వం పుణికిపుచ్చుకున్నాడు. (మే 20) ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా క్లాప్‌బోర్డ్ శుభాకాంక్షలు తెలియజేస్తుంది
‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ లో బాలనటుడిగా తొలిసారి వెండితెరపై మెరిశాడు తారక్. ఆ తర్వాత 1997లో తెరకెక్కిన ‘బాల రామాయణం’ సినిమాలో అద్భుతంగా నటించాడు. ఈ సినిమాతో తొలిసారి నంది అవార్డు సైతం అందుకున్నాడు తారక్. ఆ తర్వాత 2001లో ‘నిన్నుచూడాలని’ చిత్రంతో టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. రాజమౌళి డైరెక్షన్‌లో ‘స్టూడెంట్ నెం.1’ ఆ తర్వాత ‘ఆది’, ‘అల్లరి రాముడు’, ‘నాగ’, సింహాద్రి, ‘రాఖీ’, యమదొంగ, కంత్రి, ‘అదుర్స్’ , ‘బృందావనం’ , ‘దమ్ము’, ‘బాద్‌షా’ , ‘రామయ్య వస్తావయ్యా’ వంటి చిత్రాలతో యాక్టర్ గా మరోమెట్టెక్కాడు. 2015లో పూరీ జగన్నాథ్ తో చేసిన ‘టెంపర్’ సినిమాతో వెనుదిరిగి చూసుకోలేదు. నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత వీరరాఘవ సినిమా వరకు వరుసగా ఐదు సక్సెస్‌లను అందుకున్నాడు. ఇందులో జై లవకుశలో మూడు విభిన్న పాత్రల్లో అది కూడా ఒకే డ్రెస్ వేసుకొని తన అద్భుత నటనతో ప్రేక్షకులను ఆశ్చర్య పరిచాడు.
ఎన్టీఆర్ ప్రస్తుతం ఆయనకు 3 హిట్లు ఇచ్చిన రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ .. కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రం ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. ఎన్టీఆర్ ఇప్పటి వరుకు 29 చిత్రాల్లో నటించాడు.