HomeTelugu Big StoriesDevara సినిమాతో ప్రభాస్ ను ఈ విషయంలో దాటేసిన ఎన్టీఆర్

Devara సినిమాతో ప్రభాస్ ను ఈ విషయంలో దాటేసిన ఎన్టీఆర్

NTR beats Prabhas in this matter with Devara
NTR beats Prabhas in this matter with Devara

Devara Collections:

‘దేవర’ చిత్రం ఇటీవల విడుదలై, అన్ని తెలుగు రాష్ట్రాల్లో బయర్లకు లాభాలు చేకూర్చింది. ఇది సినిమా పరిశ్రమలో కొత్త పునఃప్రారంభాన్ని సృష్టించింది అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా రివ్యూలు ఎలా ఉన్నా మంచి కథ, స్క్రీన్ ప్లే తో, ఉన్నతమైన విజువల్స్ తో సినిమా బాగానే ఆకట్టుకుంది.

బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమా విజయానికి ప్రధాన కారకంగా మారింది. ప్రతి ప్రాంతంలో ఉన్న ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా సినిమాని బాగానే తెరకెక్కించారు కొరటాల. ఇప్పటికీ, దేవర తరహాలో మరిన్ని సినిమాలు రావాలనే ఆశతో ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. త్వరలో విడుదలవుతున్న పుష్ప 2, రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ వంటి సినిమాలు కూడా ఈ సక్సెస్ అందుకునేలా లాగానే కనిపిస్తున్నాయి.

దేవర సినిమా సక్సెస్ నేపథ్యంలో.. నెటిజన్లు ప్రభాస్, నాని వంటి హీరోలతో కంపారిజన్లు చేస్తున్నారు. ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ కి తిరుగు లేదు. ఎన్టీఆర్ కంటే ప్యాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు ఉన్న హీరో ప్రభాస్.

కానీ ప్రభాస్ సినిమాలు అన్నీ ప్రాంతాలలో కూడా బాయర్లకు 100% బ్రేక్-ఇవెన్ కావడం లేదనే విషయం హాట్ టాపిక్ గా మారింది. బాహుబలి 2 తర్వాత, ప్రభాస్ నటించిన ప్రతి సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక ఏరియా లో డిజాస్టర్ అయ్యింది. సాహో, రాధే శ్యామ్, ఆఖరికి సలార్ విషయంలో కూడా అదే జరిగింది.

ఈనేపథ్యంలో ప్రభాస్ కూడా చేయలేనిది ఎన్టీఆర్ దేవర సినిమాతో చేశారు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఫ్యాన్స్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ చేస్తున్నారు.

Read More: విడుదల తేదీలు మార్చుకుంటున్న Mega Heroes

Recent Articles English

Gallery

Recent Articles Telugu