HomeTelugu Big Stories'ఎన్టీఆర్' ఆడియో ఫంక్షన్‌లో వీరు ఏమన్నారో.. తెలుసా!

‘ఎన్టీఆర్’ ఆడియో ఫంక్షన్‌లో వీరు ఏమన్నారో.. తెలుసా!

10 17ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో వేడుక కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతోంది. హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్ హాల్‌లో జరుగుతున్న ఈ వేడకకు నందమూరి బాలకృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌, బాలీవుడ్ నటి విద్యా బాలన్, దర్శకుడు క్రిష్, సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజు, కలెక్షన్‌ కింగ్ మోహన్ బాబు, ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు, నందమూరి కుటుంబసభ్యులు తదితరులు హాజరయ్యారు. ఈ వేడుకలో పట్టువస్త్రాలతో మెరిసిపోతూ బాలకృష్ణ సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచారు. ఈ చిత్రం ట్రైలర్‌ను ఎన్టీఆర్ కుమార్తెలు గారపాటి లోకేశ్వరి, దగ్గుబాటి పురందేశ్వరి, నారా భువనేశ్వరి, కంఠమనేని ఉమా మహేశ్వరి ఆవిష్కరించారు.

10

ఈ సందర్భంగా సూపర్ స్టార్ కృష్ణ మాట్లాడుతూ..ఎన్టీఆర్ బయోపిక్ లో తన తండ్రి పాత్ర పోషించిన నందమూరి బాలకృష్ణ, అచ్చు ఎన్టీఆర్ లానే ఉన్నారని ప్రశంసించారు. డిగ్రీ పూర్తయిన తర్వాత ఎన్టీఆర్‌ని చూసేందుకు తాను మద్రాసు వెళ్లానని గుర్తుచేసుకున్నారు. ‘సినిమాల్లో నటించే ఆసక్తి ఉంది. మీ సినిమాల్లో ఏదైనా అవకాశమివ్వండి’ అని తాను అడిగితే.. ఇంకా చిన్న కుర్రాడిలా ఉన్నావు, రెండు మూడేళ్లు ఆగితే కచ్చితంగా నువ్వు పనికొస్తావని ఆయన చెప్పారని కృష్ణ వివరించారు. ఎన్టీఆర్‌తో కలిసి నటించే అవకాశం కూడా తనకు వచ్చిందన్నారు. తండ్రి పాత్ర పోషిస్తున్న బాలకృష్ణ.. ఈ సినిమాలో అచ్చం ఎన్టీఆర్‌లానే ఉన్నారని అభిప్రాయపడ్డారు.

డైలాగ్‌ కింగ్‌ మంచు మోహన్ బాబు కూడ ఉన్నారు. అన్నగారితో మొదటి నుంచి ప్రత్యేక అనుబంధం కలిగిన మోహన్ బాబు వేదికపై మాట్లాడుతూ రామారావుగారితో తన జ్ఞాపకాల్ని గుర్తుచేసుకుంటూ దర్శకుడు క్రిష్ అద్భుతంగా సినిమా చేశారని, సినిమాను ఎక్కడ మొదలుపెట్టి, ఎక్కడ ముగించారో, చెడ్డవారిని కూడ మంచివారిగా చూపారో తెలీదంటూ, సినిమా పెద్ద విజయం కావాలని కోరుకున్నారు.

10b

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. రామారావుగారితో పలు సూపర్ హిట్ సినిమాలు చేసిన రాఘవేంద్రరావు వేదికపై మాట్లాడుతూ అన్నగారితో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ నేను ఆయనతో 12 సినిమాలు తీశాను, కాబట్టి ఈ ఎన్టీఆర్ సినిమాను నెలకోకసారి చొప్పున 12 సార్లు చూస్తాను అన్నారు. ఇకపోతే ఈ చిత్రంలో రాఘవేంద్రరావుగారి పాత్రను ఆయన కుమారుడు ప్రకాష్ చేయడం విశేషం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu