స్టార్ హీరోలు ఒక వైపు సినిమాలతో .. మరో వైపున బడా వ్యాపార సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు. ఇందుకు వాళ్లకి కోట్లలో పారితోషికం ఉంటుంది. అందువలన స్టార్ హీరోలు తమకి నచ్చిన బ్రాండ్స్ కి ప్రచారకర్తలుగా వ్యవహరిస్తూనే ఉన్నారు.ఇప్పటికే మహేశ్ బాబు, రామ్ చరణ్,అల్లు అర్జున్, ఎన్టీఆర్ ఈ బిజినెస్‌లో బిజీగా ఉన్నారు.
ఇటు నార్త్ లోను .. సౌత్ లోను మంచి క్రేజ్ .. మంచి మార్కెట్ ఉన్న స్టార్ హీరోలనే ఈ సంస్థలు అంబాసిడర్లుగా ఎంచుకుంటూ ఉంటాయి. ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాతో ఎన్టీఆర్ రేంజ్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్థాయికి వెళ్లిపోయింది. అందువలన ఆయనను బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకోవడానికి కొన్ని కంపెనీలు పోటీపడుతున్నాయి.
తాజాగా ‘మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్’ సంస్థవారు ఎన్టీఆర్ ను తమ బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ప్రచార చిత్రాలలో ఎన్టీఆర్ నటించవలసి ఉంటుంది. అందుకుగాను కోట్ల రూపాయల డీల్ ను ఈ సంస్థతో ఆయన కుదుర్చుకున్నట్టుగా సమాచారం. ప్రస్తుతం ఆయన కొరటాలతో ‘దేవర’ చేస్తున్న సంగతి తెలిసిందే.
అనుష్క ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ టీజర్
సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్: భయం కలిగించే చాలా సన్నివేశాలు
బట్టలు లేకుండా హట్ లుక్‌లో విద్యాబాలన్
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు