దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన ప్రతిష్టత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాలోని ‘నాటునాటు’ పాటకు బెస్ట్ ఒరిజనల్ సాంగ్ కేటగిరీలో… ఆస్కార్ అవార్డ్ దక్కిన విషయం తెలిసిందే. ఓ పాటకు ఆస్కార్ రావడం దేశ చలనచిత్ర పరిశ్రమలో ఇదే తొలిసారి. ఆస్కార్ అవార్డ్స్ ఫంక్షన్ తరువాత ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ ఈ ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు
హైదరాబాద్ చేరుకున్న ఎన్టీఆర్‌కు ఘన స్వాగతం లభించింది. ఫ్యాన్స్ కోలాహలంతో శంషాబాద్ విమానాశ్రయం రద్దీగా మారింది. విమానాశ్రయం బయటకు వచ్చిన ఎన్టీఆర్ మాట్లాడుతూ.. “ఎంఎం కీరవాణి, చంద్రబోస్‌లు ఆస్కార్ అవార్డును స్వీకరించడం బెస్ట్ మూమెంట్. నేను RRR గురించి చాలా గర్వంగా భావిస్తున్నాను. ఆర్‌ఆర్‌ఆర్‌ని ప్రోత్సహించినందుకు ప్రతి భారతీయుడికీ నేను కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. మేము గెలుచుకున్న ఈ అవార్డు ప్రేక్షకుల ప్రేమ, చిత్ర పరిశ్రమతో మాత్రమే సాధ్యమైంది” అని జూనియర్ తెలిపారు.
మరోవైపు నాటు నాటు పాటకు కొరియోగ్రఫీ చేసిన ప్రేమ్ రక్షిత్ కూడా హైదరాబాద్ విచ్చేశారు. ఆయన కూడా ఆస్కార్ రావడం ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. ఈ పాట కోసం తాను 2 నెలల పాటూ కష్టపడ్డాను అని తెలిపారు. తాను కంపోజ్ చేసిన స్టెప్స్‌ని ఆస్కార్ వేదికపై వేయడం ఎంతో ఆనందం కలిగిందని తెలిపారు. ఈ పాట కోసం రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ ఎంతో కష్టపడ్డారన్న ప్రేమ్ రక్షిత్… రాజమౌళితో పనిచేయడం అనేది ఒక్క మాటలో చెప్పలేమనీ.. అదో సిరీస్ అనీ అన్నారు.
దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది
బట్టలు లేకుండా హట్ లుక్‌లో విద్యాబాలన్
రావణాసుర టీజర్: రవితేజ హీరో నా.. విలన్‌నా!
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు