రాజమౌళి.. ఎన్టీఆర్ కి హీరో గా స్టాండ్ తో పాటు స్టార్డం కూడా కట్టబెట్టిన బెస్ట్ టాలీవుడ్ డైరెక్టర్. అందుకే జక్కన్న అంటే తారక్ కి అంత అభిమానం. ఇక రాజమౌళికి ఇండస్ట్రీ లో పర్మినెంట్ ప్లేస్ కల్పించిన సింహాద్రి సినిమా రాజమౌళికి రావడానికి కారణం ఎన్టీఆర్. అందుకే ఎన్టీఆర్ అంటే జక్కన్నకి కూడా చాలా ఇష్టం. అందుకే వీళ్ళు ఎప్పుడు కుదిరినా కలిసి సినిమా చెయ్యాలనుకుంటారు. ఇక ఈ మధ్య మంచి కంటెంట్ ఉన్న కథలతో వరుసగా బ్లాక్ బస్టర్స్ కొడుతున్న కొరటాల శివ రైటర్ గా ఉన్న రోజుల్లో బాగా ఎంకరేజ్ చేసాడు. ఎన్టీఆర్ కి జనతా గారేజ్ తో ఇండస్ట్రీ హిట్ అందించాడు కొరటాల. అలా రాజమౌళి,కొరటాల ఎన్టీఆర్ కి చాలా క్లోజ్ అయ్యారు.
వాళ్ళు ఆడియన్స్ పల్స్ బాగా తెలిసిన అపజయమెరుగని డైరెక్టర్స్ కావడంతో కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్న తారక్ కధల ఎంపికలో వాళ్ళ సజెషన్స్ తీసుకుంటున్నాడు. అలా జైలవకుశ కథ విని ఇంప్రెస్ అయిన ఎన్టీఆర్ ఆ పాయింట్ ని జక్కన్న, కొరటాల కి వినిపించి వాళ్ళు ఓ.కె అన్న తరువాత సెట్స్ పైకి తీసుకెళ్లాడు. ఈ విషయాన్ని అనుకోకుండా రివీల్ చేసాడు ఆ సినిమాకి స్క్రీన్ ప్లే రైటర్ గా పనిచేసిన కోన వెంకట్. ఈ సినిమాలో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండబట్టే సినిమాలో కొన్ని సీన్స్ ముందే చూసి ఆడియో ఫంక్షన్ లో సినిమాపై తన నమ్మకాన్ని స్ట్రాంగ్ గా చెప్పాడు కొరటాల.
ఇక సినిమా చూసిన తర్వాత తన మనసంతా గర్వముతో నిండిపోయిందని ట్వీట్ చేసాడు రాజమౌళి. ఈ విషయంతో తన అభిమానులను డిసప్పాయింట్ చేయిద్దాం ఇష్టం లేని ఎన్టీఆర్ ఎంత పకడ్బందీగా తన కెరీర్ ని ప్లాన్ చేసుకుంటాడో అర్ధం అవుతుంది. త్రివిక్రమ్ విషయంలో మాత్రం ఆ అవసరంలేకపోవడంతో సోలో గా ఫిక్స్ అయ్యి పని కానిచ్చేస్తున్నాడు.