HomeTelugu News'ఎన్టీఆర్ ఎ బయోగ్రఫీ' పుస్తక ఆవిష్కరణ

‘ఎన్టీఆర్ ఎ బయోగ్రఫీ’ పుస్తక ఆవిష్కరణ

10 21దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మహానుభావుడని.. సమాజం కోసం లోక్‌నాయక్ జయప్రకాష్‌ నారాయణ్‌లా సేవ చేశారని కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు అన్నారు. రిటైర్డ్‌ ఐఆర్‌ఎస్‌ అధికారి కె.చంద్రహాస్‌, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి కె.లక్ష్మీనారాయణ రచించిన ‘ఎన్టీఆర్ ఎ బయోగ్రఫీ’ పుస్తకాన్ని ఇవాళ హైదరాబాద్‌లో ఆయన ఆవిష్కరించారు. మొదటి పుస్తకాన్ని ఎన్టీఆర్‌ తనయుడు నందమూరి రామకృష్ణ అందుకున్నారు. ఈ సందర్భంగా అశోక్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ తెలుగు ప్రజలకు చేసిన సేవ మరెవ్వరూ చెయ్యలేదన్నారు. తెలుగు భాష, సంస్కృతి ఉన్నంత కాలం ఎన్టీఆర్ ఖ్యాతి ఉంటుందన్నారాయన.

నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ ఎన్టీఆర్ గురించి అందరికి తెలియాలన్నారు. బయోగ్రఫీ రాసిన రచయితలకు ధన్యవాదాలు చెప్పారు. మొదటి పుస్తకం అందుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఎన్టీఆర్ జీవిత కథను కేవలం తెలుగు ప్రజలకే కాకుండా దేశవ్యాప్తంగా తెలియజెప్పడానికి ఈ పుస్తకాన్ని ఇంగ్లిష్‌లో రచించామని రచయితలు చెప్పారు. ఎన్టీఆర్ పుట్టుక నుంచి తుదిశ్వాస విడిచేంత వరకు ఆయన జీవితంలోని ప్రతి అంశాన్ని ఈ పుస్తకంలో ప్రస్తావించామని చెప్పారు. ఇంగ్లిష్ భాషలో వస్తున్న తొలి ఎన్టీఆర్ బయోగ్రఫీ ఇదే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu