HomeTelugu Newsరైలు కోసం భూమి ఇచ్చిన ఎన్‌ఆర్‌ఐ మహిళ

రైలు కోసం భూమి ఇచ్చిన ఎన్‌ఆర్‌ఐ మహిళ

గుజరాత్‌-మహారాష్ట్ర మధ్య బుల్లెట్‌ రైలు ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. మొత్తం 508 కిలోమీటర్ల మేర నిర్మించే ఈ కారిడార్‌ కోసం రెండు రాష్ట్రాల్లో కలిపి 1,400 హెక్టార్ల భూమి అవసరం. ఇందులో 1,120 హెక్టార్ల భూమి ప్రైవేటు వ్యక్తులకు చెందినది. దీంతో ఆ భూమిని ఇవ్వాలని రైల్వే అధికారులు కోరుతున్నారు. అయితే రైతులు, భూయజమానులు అందుకు అంగీకరించకపోవడంతో భూసేకరణ కష్టంగా మారింది. ఇప్పటివరకు మహారాష్ట్రలో 0.09శాతం భూమిని మాత్రమే అధికారులు సేకరించారు.

2

బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు కోసం గుజరాత్‌కు చెందిన ఓ ఎన్నారై భూమిని విరాళంగా ఇచ్చారు. గుజరాత్‌లోని చన్సాద్‌ గ్రామానికి చెందిన సవితా బెన్‌ 33 ఏళ్ల క్రితం జర్మనీ వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఆమెకు చన్సాద్‌లో 71 ఎకరాల భూమి ఉంది. అందులో నుంచి 29.50 ఎకరాల భూమిని నేషనల్‌ హైస్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్ సంస్థకు ఇచ్చారు. ఈ ప్రాజెక్టు కోసం భూమి ఇచ్చేందుకు సవిత ప్రత్యేకంగా భారత్‌కు వచ్చారు. ఇందుకు ఆమెకు అధికారులు ధన్యవాదాలు తెలిపారు. సవిత జర్మనీలో తన కుమారులతో కలిసి రెస్టారెంట్‌ నడుపుతున్నారు. బుల్లెట్‌ రైలు కోసం గుజరాత్‌లో ప్రభుత్వానికి భూమి ఇచ్చిన తొలి వ్యక్తి ఆమే కావడం విశేషం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu