HomeTelugu Reviewsనోటా మూవీ రివ్యూ

నోటా మూవీ రివ్యూ

అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలతో సెన్సేషనల్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నాడు విజయ్‌ దేవరకొండ. తాజాగా విజయ్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘నోటా’. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్‌ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించాడు. అరిమనంభి, ఇరుముగన్‌ సినిమాలతో తమిళనాట దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న ఆనంద్‌ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో విజయ్‌కి జంటగా మెహరీన్‌ కనిపించనున్నారు. ఈ సినిమాతో విజయ్‌ కోలీవుడ్‌కు కూడా పరిచయం అవుతుండటంతో నోటా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాల నోటా అందుకుందా..ఈ సినిమాతో విజయ్‌ తన హిట్ ట్రాక్‌ను కంటిన్యూ చేశాడా?

8 3

కథ: రాజకీయాలంటే గిట్టని వరుణ్‌వరుణ్‌ (విజయ్‌ దేవరకొండ) ముఖ్యమంత్రి వాసుదేవ్‌(నాజర్‌) కొడుకు. లండన్‌లో వీడియో గేమ్‌ డిజైనర్‌ గా పనిచేస్తుంటాడు. వరుణ్‌కి రాజకీయాలంటే గిట్టవు. వరుణ్‌ఇండియాలోని కొన్ని అనాథాశ్రమాలకు మహేంద్ర (సత్యరాజ్‌) సహకారంతో సాయం చేస్తుంటాడు. ఫ్రెండ్స్‌తో కలిసి ఎంజాయ్‌ చేసే వరుణ్‌ అనుకోకుండా సీఎం కుర్చీలో కూర్చోవాల్సి వస్తోంది. తండ్రి వాసుదేవ్‌ ఓ కేసు విషయంలో విచారణ ఎదుర్కోవాల్సి రావటంతో రాజకీయాలతో సంబంధంలేని వరుణ్‌ని అధికార పీఠం మీద కూర్చోపెట్టి వెనకుండి అంతా నడిపించాలని భావిస్తాడు వాసుదేవ్‌. కానీ ఆ కేసులో వాసుదేవ్‌కు శిక్షపడటం, బెయిల్‌పై తిరిగి వస్తుండగా వాసుదేవ్‌ మీద హత్యా ప్రయత్నం జరగటంతో వరుణ్ సొంతంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తండ్రి మీద జరిగినట్టుగానే తన మీద ఇతర కుటుంబ సభ్యుల మీద దాడులు జరిగే అవకాశం ఉందని వరుణ్‌కి తెలుస్తుంది. దీని వెనుక వేల కోట్లకు సంబంధించిన లావాదేవీలు ఉన్నాయని ఇంటిలిజెన్స్‌ వర్గాలు చెపుతాయి. అదే సమయంలో కోలుకున్న వాసుదేవ్‌.. వరుణ్ అధికారంలో ఉండేందుకు తనను మోసం చేస్తున్నాడని భావించి పార్టీని తన కంట్రోల్‌లోకి తెచ్చుకునే ప్రయత్నాలు ప్రారంభిస్తాడు. రాజకీయాలతో ఏ మాత్రం సంబంధం లేని వరుణ్ ఈ పరిస్థితులను ఎలా ఎదుర్కుంటాడు. మాజీ ముఖ్యమంత్రి వాసుదేవ్‌ మీద హత్యా ప్రయత్నం చేసింది ఎవరు. చివరకు వరుణ్ రాజకీయ నాయకుడిగానే కొనసాగాడా.. లేదా? అన్నదే కథలోని అంశం

8a

నటీనటులు:విజయ్‌ దేవరకొండ ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచాడు. విజయ్ ఒక్కో సినిమాలో ఒక్కో డిఫరెంట్‌ క్యారెక్టర్‌తో అభిమానులకు షాక్‌ ఇస్తున్నాడు‌. సినిమా అంతా తన భుజాల మీదే నడిపించాడు. గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో డిఫరెంట్‌ లుక్‌, క్యారెక్టరైజేషన్‌తో మెప్పించాడు. రౌడీ సీఎం పాత్రలో పర్ఫెక్ట్‌ గా సూట్‌ అయ్యాడు. ఎమోషనల్‌ సీన్స్‌లో విజయ్‌ నటన సూపర్బ్‌. మరో ప్రధాన పాత్రలో సత్యరాజ్‌ ఆకట్టుకున్నాడు. హీరోకు ప్రతీ విషయంలో సాయం చేసే పాత్రలో ఆయన ఒదిగిపోయారు. మరో కీలక పాత్రలో నాజర్‌ జీవించారు. పార్టీ నాయకుడిగా నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో నాజర్‌ నటన సినిమాకు మరో బలం. హీరోయిన్‌ మెహరీన్‌ది కేవలం అతిధి పాత్రే. ఇతర పాత్రల్లో సంచన నటరాజన్‌, ప్రియదర్శి, ఎంఎస్‌ భాస్కర్‌ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

8b

విశ్లేషణ :విజయ్‌ దేవరకొండ లాంటి నటుణ్ని ఓ పొలిటికల్‌ డ్రామాకు ఎంచుకోవటం సాహసం అనే చెప్పాలి. అయితే దర్శక నిర్మాతలు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని విజయ్‌ నిలబెట్టుకున్నాడు. తానే ప్రధాన బలంగా మారి సినిమాను నడిపించాడు. హీరోను ప్లేబాయ్‌ల పరిచయం చేస్తూ సినిమాలు మొదలు పెట్టిన దర్శకుడు ఆనంద్‌ శంకర్‌.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు కథ ప్రారంభించాడు. వెంటనే వరుణ్ పాత్ర సీఎం కావటం తరువాత రాజకీయ పరిణామాలు, విజయ్ నటన, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌, ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ ఇలా మొదటి భాగం అద్భుతంగా అనిపిస్తుంది‌. అయితే రెండోవ భాగంలోను అదే స్థాయిలో తెరకెక్కించటంలో దర్శకుడు కొంచెం తడబడ్డాడు. ద్వితీయార్థంలో అక్కడక్కడ కథనం నెమ్మదించటం కాస్త ఇబ్బంది పెడుతుంది. ఇటీవల కాలంలో తమిళ రాజకీయల్లో జరిగిన పరిణామాల నేపథ్యంలో కథను తయారు చేసుకున్న దర్శకుడు తెలుగు నేటివిటీకి అనుగుణంగా ఇంకొన్ని మార్పులు చేసి ఉంటే బాగుండనిపిస్తుంది. భారీ థ్రిల్స్‌ను ఆశించిన ప్రేక్షకులను క్లైమాక్స్‌ కూడా కొంచెం నిరాశపరుస్తుంది. సినిమాకు ప్రధాన బలం సామ్‌ సీయస్‌ మ్యూజిక్‌. పాటలు పరవాలేదనిపించినా సామ్‌ అందించిన నేపథ్య సంగీతం ప్రతీ సీన్‌ను మరో రేంజ్‌కు తీసుకెళ్లింది. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి

హైలైట్స్
విజయ్‌ దేవరకొండ నటన

డ్రా బ్యాక్స్
సెకండాఫ్

చివరిగా : రౌడీ సీఎం ‘నోటా’ ప్రజలను మెప్పించాడు
(గమనిక : ఇది కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

టైటిల్ : నోటా
నటీనటులు : విజయ్‌ దేవరకొండ, సత్యరాజ్‌, నాజర్‌, మెహరీన్‌
సంగీతం :సామ్‌ సీయస్‌
దర్శకత్వం : ఆనంద్‌ శంకర్‌
నిర్మాత : జ్ఞానవేల్‌ రాజా

Recent Articles English

Gallery

Recent Articles Telugu

అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలతో సెన్సేషనల్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నాడు విజయ్‌ దేవరకొండ. తాజాగా విజయ్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం 'నోటా'. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్‌ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించాడు. అరిమనంభి, ఇరుముగన్‌ సినిమాలతో తమిళనాట దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న ఆనంద్‌ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో...నోటా మూవీ రివ్యూ