HomeTelugu Trendingరోజు భర్తకు నాన్‌ బెయిలబుల్‌ అరెస్ట్‌ వారెంట్‌

రోజు భర్తకు నాన్‌ బెయిలబుల్‌ అరెస్ట్‌ వారెంట్‌

non bailable warrant to rk

ప్రముఖ దర్శకుడు, ఏపీ మంత్రి రోజా భర్త ఆర్కే సెల్వమణిపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ముకుల్‌చంద్ బోత్రా అనే సినిమా ఫైనాన్షియర్ 2016లో ఓ కేసులో అరెస్ట్ అయ్యారు. ఆయన కారణంగా తాను చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందంటూ ఓ చానల్‌ ఇంటర్వ్యూలో సెల్వమణి ఆరోపించారు.

ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన ముకుంద్‌చంద్.. సెల్వమణిపై పరువునష్టం దావా వేశారు. ఆ తర్వాత ముకుంద్‌చంద్ చనిపోయినా ఆయన కుమారుడు గగన్‌బోత్రా ఈ కేసును కొనసాగిస్తున్నారు. సోమవారం ఈ కేసు విచారణ జరగ్గా సెల్వమణి కోర్టుకు హాజరు కాలేదు. దీంతో చెన్నై జార్జ్‌టౌన్ కోర్టు ఆయనపై నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేస్తూ తదుపరి విచారణను సెప్టెంబరు 22కు వాయిదా వేసింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu