సింగర్ నోయల్ ఇప్పటి వరుకు విలన్, కమెడియన్, హీరో ఫ్రెండ్‌గా ఇలా చాలా సినిమాల్లో కనిపించారు. బిగ్ బాస్ షో ద్వారా మంచి ఇమేజ్‌ను సంపాదించుకున్నారు. అలా మొత్తానికి నోయల్‌కు సోషల్ మీడియాలో ఇప్పుడు ఫుల్ క్రేజ్ వచ్చింది. ఇక ఇప్పుడు ‘మనిషి’ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. రెండ్రోజుల క్రితం నోయల్ ఓ పోస్ట్ చేశారు. ఇందులో ఓ ఎగ్జైటింగ్ న్యూస్ చెప్పబోతోన్నానంటూ ప్రకటించాడు. అయితే అలా నోయల్ చేసిన పోస్ట్ మీద నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ఎగ్జైట్ న్యూస్ అని చెప్పడంతో అంది కచ్చితంగా తన రెండో పెళ్లి గురించి అయి ఉంటుందని అనుకున్నారు. అయితే తాజాగా నోయల్ అసలు విషయం చెప్పారు. తన జీవితంలోని కొత్త ఆరంభం గురించి ప్రకటించేశారు. తన హీరోగా రాబోతోన్న కొత్త సినిమా అప్డేట్‌ను ఇచ్చేశారు. దీంతో నోయల్ ఫుల్ ఖుషీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో పూజిత పొన్నాడ హీరోయిన్‌గా నటించి బోతుంది. స్పార్క్ ఓటీటీలో ఈ మూవీ జూన్ 18 నుంచి అందుబాటులోకి రానుందని ప్రకటించారు. వినోద్ నాగుల దర్శకత్వం వహించగా.. సత్యనారాయణ నాగుల ఈ మూవీని నిర్మించారు.
View this post on Instagram