
Summer 2025 Shooting Updates:
వేసవి 2025 రేపటి నుంచి బాగా ఎండలు వేస్తోందని వాతావరణ శాఖ చెబుతోంది. దీంతో టాలీవుడ్‌లో చాలా మంది స్టార్స్ తాత్కాలికంగా షూటింగ్‌ల నుంచి బ్రేక్ తీసుకుంటున్నారు. అయితే కొంత మంది మాత్రం పని మీదే ఫోకస్ పెట్టారు.
తారక్ అంటే Jr. NTR మాత్రం ఈ వేసవిలోనూ బ్రేక్ తీసుకోట్లేదు. ఆయన ప్రస్తుత ప్రాజెక్ట్, ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో జరుగుతోన్న సినిమా షూటింగ్ ఏప్రిల్ 22 నుంచి స్టార్ట్ అవుతుంది. హైదరాబాద్లో జరిగే ఈ లాంగ్ షెడ్యూల్ మే నెలంతా కొనసాగుతుంది. అంటే తారక్ కి ఈసారి ఎండలోనే పని ఎక్కువగా ఉండబోతుంది.
ఇక రామ్ చరణ్ విషయానికి వస్తే, ఆయన బుచ్చి బాబు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘పెద్ది’ సినిమా కోసం చిన్న చిన్న బ్రేక్‌లు తీసుకుంటూ షూట్ చేస్తారు. ఈ సినిమా 2026 వేసవిలో విడుదల అవ్వాలన్న ఆలోచనతో చరణ్ పూర్తిగా కమిట్‌మెంట్ చూపుతున్నారు.
మహేష్ బాబు మాత్రం వాస్తవంగా ఒక రిలాక్స్‌డ్ సమ్మర్ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం విదేశాల్లో ఫ్యామిలీతో వెకేషన్‌లో ఉన్న మహేష్, వచ్చే వారం తిరిగి వచ్చాక SSM29 సినిమా షూటింగ్‌లో జాయిన్ అవుతారు. ఈ సినిమా షూట్ ఏప్రిల్ చివరి వారం నుంచి మే మద్య వరకు సాగుతుంది.
ఇక మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లాంటి సీనియర్ స్టార్స్ వేసవిలో పూర్తిగా బ్రేక్ తీసుకుంటున్నారు. హీట్ ఎక్కువగా ఉండటంతో వాళ్లు రెస్ట్ తీసుకోవడమే బెస్ట్ అనుకుంటున్నారు.
బాలకృష్ణ మాత్రం ‘అఖండ 2’ కోసం షూటింగ్‌ను కొనసాగిస్తున్నారు. అంతేకాదు కొన్ని యువ హీరోలు మాత్రం హాలీడే మూడ్‌లోకి వెళ్లిపోయారు. మొత్తం మీద, ఈ వేసవి టాలీవుడ్‌లో కొందరికి వర్కింగ్ సమ్మర్, మరికొందరికి చిల్ బ్రేక్ అవుతోంది!