కూకట్‌పల్లిలో రేపు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచార రోడ్‌షోకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఇప్పటికే మంత్రి కేటీఆర్ రోడ్ షోకు అనుమతి ఇచ్చామని కూకట్‌పల్లి పోలీసులు తెలిపారు. ఒకే రోజు మరో పార్టీకి అనుమతి ఇవ్వలేని తెలిపారు.
నేడు ఖమ్మం బహిరంగ సభతో తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు రేపు కూకట్‌పల్లిలో మహాకూటమి నుంచి టీడీపీ నుంచి బరిలో ఉన్న నందమూరి సుహాసినికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించాలని భావించారు. ఈ నేపథ్యంలో పోలీసులు రోడ్‌షోకు అనుమతి నిరాకరించడం గమనార్హం.