జగన్ మోహన్ రెడ్డి ఒక సెక్షన్ జనాలకి నచ్చడం లేదు. అందులో నగరాల్లో ఉండే చదుకునే వాళ్లే ఎక్కువ. కాబట్టే.. ఆంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది. ఇది జగన్ రెడ్డి సన్నిహితుల నుంచి ఓటమి పై వస్తున్న వివరణ. నిజమే.. జగన్ రెడ్డికి ఓట్లు వేసే మెజారిటీ జనం పట్టభద్రులలో ఉండరు. పల్లెల్లో అరుగుల మీద ఉంటారు. వాళ్లలో పెద్దగా అసంతృప్తి ఉండదు. కారణం.. నేరుగా వారికీ జగన్ రెడ్డి డబ్బులు వేస్తున్నాడు కాబట్టి. పైగా ఇంతకు ముందెన్నడూ లేని విధంగా జగన్ రెడ్డి వారికీ డబ్బులు పంచిపెడుతున్నాడు.
అప్పులు చేసి మరీ, ఆంధ్ర భవిష్యత్తును నాశనం చేసి మరీ జగన్ రెడ్డి బటన్లు నొక్కుతున్నాడు. కాబట్టి, జనాభాలో ఎక్కువ మంది ఉండే పేదవారికి జగన్ రెడ్డి పథకాలు బాగా నచ్చుతున్నాయి. రోడ్లు బాలేకపోవడం, పవర్ కట్ వాళ్ళకి కొత్తేమి కాదు కాబట్టి, ఆ పేద వారంతా ఆంధ్రలోని సమస్యలను పెద్దగా పట్టించుకోరు. ఇది జగన్ రెడ్డి ఆలోచనా విధానం. జైలులో చిప్పకూడు తిని వచ్చినోడికి ఇంతకు మించిన ఆలోచనా విధానం ఉంటుందని ఎలా అనుకోగలం. ఇది డిజిటల్ ప్రపంచం.
ప్రతి పేద వాడి ఇంట్లో కూడా ఓ స్మార్ట్ ఫోన్ ఉన్న లోకం. పైగా పల్లెలోని వ్యక్తి కూడా యూట్యూబ్ లో రాజకీయ వార్తలను చూడటం అలవాటు చేసుకున్న కాలం ఇది. ఇలాంటి కాలంలో జగన్ రెడ్డి బటన్లు చూసి ఓట్లు వేస్తారనుకోవడం అమాయకత్వం, మూర్ఖత్వం. అసలు ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరంపై తమ స్టాండ్ గురించి క్లారిటీ ఇవ్వకుండా 2024 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగలదు అనుకోవడం అత్యాశే. రాబోయే పది నెలల్లో చాలా మార్పులు వస్తాయి. ఆల్ రెడీ ప్రజల్లో మార్పు వచ్చింది. ఆ మార్పుకు నిదర్శనమే ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు.
పైగా ఆంధ్ర రాష్ట్రంలో రాజధాని విషయం కంటే, రాష్ట్ర ప్రజలను పీడించే సమస్యలు చాలా ఉన్నాయి. వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకున్న తర్వాతే జనం ఓట్లు వేస్తారు. గతాన్ని పరిశీలిస్తే.. రాష్ట్ర ఎన్నికల ముఖ చిత్రం ప్రతి అయిదేళ్ళ కు ఒకసారి చాలా మార్పు చెందుతూ వస్తోంది. కాబట్టి, 2024 లో లేదా అంతకు ముందు జరిగే ఎన్నికలు చాలా రసవత్తరంగా ఉంటాయి. అధిక జనాభా ఎటువైపు ఉంటే వాళ్లదే రాజ్యం. ప్రజాస్వామ్యంలో అధిక జనాభా ఎప్పుడు మంచి వైపే ఉంటుంది. ఈ విషయంలో ఎవరూ ఎన్ని చెప్పినా ఆ సమాధానాలు అసంతృప్తిగానే ఉంటాయి.
ఎందుకంటే.. నేటి కాలం ప్రజలు ఎంతో తెలివైన వారు. అలాంటి వారిని ప్రతిసారి మాయ చేయడం సాధ్యం కాదు. కానీ, మనోభావాలను రెచ్చిగొట్టి గెలవాలి అని జగన్ రెడ్డి ప్లాన్ లో ఉన్నాడు. అందుకే, జనాభా సంఖ్యకి అనుగుణంగా కులాల వారీగా పదవులు కట్టబెట్టాడు. ఆకలితో ఉన్న వాడు కులం కోసం యుద్ధం చేయడు, కులం కోసం ఆకలి త్యాగం చేయడు. కచ్చితంగా కులం బాణం ఈసారి పారదు. కరెంటు కోత, రోత రోడ్లు, అన్నిటికి మించి అధిక ధరలు.. ఇలా ఎన్నో అంశాలు జగన్ రెడ్డి పతనానికి కారణాలు కాబోతున్నాయి.