Bigg Boss 8 Telugu Grand Finale:
బిగ్ బాస్ 8 తెలుగు సీజన్ చివరి దశకు చేరుకుంది. డిసెంబర్ 15, 2024న ఫైనల్ ఎపిసోడ్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రతి ఏడాదిలానే ఈసారి కూడా గ్రాండ్ ఫినాలేను అద్భుతమైన స్థాయిలో నిర్వహించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
ఇంటిలో ఇప్పటివరకు అన్ని ఎలిమినేషన్స్ పూర్తయ్యాయి. ఈ వారం ఇంటిలో టాస్కులు లేకపోవడం వల్ల, ప్రధానంగా ఫైనలిస్ట్‌లను ప్రశంసించడంపై దృష్టి పెట్టనున్నారు. అంతేకాకుండా, ఈ సీజన్‌కు సంబంధించిన ముఖ్యమైన వీడియోలను కూడా ప్రసారం చేస్తారు. అందువల్ల, ఈ వారం ప్రేక్షకులకు కొంత బోరింగ్ గా అనిపించవచ్చని చెప్పచ్చు.
ఫైనల్ ఎపిసోడ్‌కు సంబంధించిన రిహార్సల్స్, మేకర్స్ ఏర్పాటు చేసే ఇతర కార్యక్రమాలు ఈ వారం ఇంటి బయట జరుగనున్నాయి. గ్రాండ్ ఫినాలేలో వివిధ ప్రత్యేక ప్రదర్శనలు, సెలబ్రిటీ ల రాకలు వంటి విషయాలు ఆకట్టుకునేలా ఉండనున్నాయి.
ఈ వారం ఇంట్లో సైలెంట్ వాతావరణం ఉన్నప్పటికీ, ఫినాలే వేడుకలు మాత్రం అభిమానులను ఆకట్టుకునేలా ఉండే అవకాశం ఉంది. ఫైనలిస్ట్‌ల మధ్య పోటీని చూసి ప్రేక్షకులు గెలుపొందే కంటెస్టెంట్ ఎవరవుతారని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ALSO READ: Thalapathy 69: రీమేక్ సినిమాతో 1000 కోట్లు సాధ్యమేనా?